Negative Energy: ఈ తప్పులు చేస్తే ప్రతికూల శక్తి ఏర్పడే అవకాశం.. అసలేం జరిగిందంటే?

Negative Energy: సాధారణంగా మన ఇంట్లో చాలా పరిశుభ్రంగా ఉండి అన్ని సరైన దిశలలో ఉన్నట్లయితే వాస్తు ప్రకారం ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని భావిస్తారు. అలాగే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులపై ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదని, ఆ కుటుంబం పై ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని భావిస్తుంటారు. అయితే మన కుటుంబం పై ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడాలి అంటే మనం కొన్ని పొరపాటులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

మన ఇంట్లో కొన్ని వస్తువులను ఇలా కనుక ఉంచినట్లయితే తప్పకుండా ఆ ఇంటిపై నెగటివ్ ప్రభావం ఏర్పడుతుంది మరి ఏ వస్తువులను ఎలా ఉంచాలి ఇంట్లో ఏవి ఉండకూడదు అనే విషయానికి వస్తే…మన ఇంట్లో ఎప్పుడూ కూడా మందులకు సంబంధించిన వ్యర్ధాలు ఉండకూడదు ఇలా ఉండటం వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది.అలాగే ఇంట్లో చీకటిగా ఉంటే ఆ ఇంటి పై నెగిటివ్ ప్రభావం ఉంటుందని చెబుతారు. అందుకే సంధ్యా సమయం అయ్యే లోపు ఇంట్లో దీపాలు వెలిగించాలి.

 

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం దరిద్ర దేవతకు అపరిశుభ్రత ఇష్టం అందుకే మన ఇంట్లో ఎలాంటి చెత్తాచెదారాలు లేకుండా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది లేదంటే దారిద్ర దేవత మన ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మన ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు బొమ్మలు ఉండకూడదు.

 

చాలామంది విరిగిపోయిన దేవుడు విగ్రహాలు పగిలిపోయిన బొమ్మలను అలాగే అద్దాలను ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ ఇంటిపై ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఇలా విరిగిపోయిన పగిలిపోయిన దేవుడు విగ్రహాలు లేదా బొమ్మలు కనుక ఉంటే వెంటనే వాటిని తీసి బయట పడేయడం వల్ల ఆ ఇంటిపై అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -