NTR: ఇద్దరు కొడుకుల విషయంలో తారక్ కోరిక ఇదే.. కానీ?

NTR: సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. సినిమాల విషయంలోనే కాదు ఫ్యామిలీ విషయంలో కూడా ఎన్టీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తాడు. నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్ కాగా చిన్న కుమారుడి పేరు భార్గవ్ రామ్.

 

ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అయితే తన కుమారుల విషయంలో తారక్ అప్పుడే ఒక ప్లాన్‌ సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక కొడుకును డాక్టర్ చేయాలని, మరో కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ చెయ్యాలని తారక్ అనుకుంటున్నాడు. ఒకవేళ కొడుకులకు సినిమా రంగంపై ఆసక్తి ఉంటే మాత్రం వాళ్లను సినిమాల్లోకి రానివ్వాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. బాలరామాయణం సినిమాలో అతడి నటనకు అందరూ నీరాజనాలు పలికారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకులు కూడా బాల నటులుగా ఇండస్ట్రీకి పరిచయమైతే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కొడుకులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

 

ఎన్టీఆర్ కుమారుల పేరు వెనుక కథ
మహానటుడు నందమూరి తారకరామారావు పేరును నందమూరి ఫ్యామిలీలో పిల్లలకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రకారమే ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడికి అభయ్ రామ్ అని.. తన రెండో కుమారుడికి భార్గవ రామ్ అని పేరు పెట్టాడు. తారక్, లక్ష్మీ ప్రణతి దంపతులకు 2014, జూన్ 22న అభయ్ రామ్ జన్మించగా.. 2018చ జూన్ 14న భార్గవ్ రామ్ జన్మించాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా సాగుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -