Navya Swamy-Ravi Krishna: నవ్యస్వామి రవికృష్ణ పెళ్లికి సంబంధించి అసలు క్లారిటీ ఇదే!

Navya Swamy-Ravi Krishna: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటుడు రవికృష్ణ, నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఉన్న క్రేజీ జంటలలో రవికృష్ణ, నవ్యస్వామి జంట కూడా ఒకటి. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసిగట్టుగా వెళ్తుటారు. బుల్లితెర పై ఏ షోకు వెళ్లినా, ఏ ఈవెంట్‌కి వెళ్లినా జంటగా వెళ్ళడంతో పాటు రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు. నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు. అయితే వీరు రియల్ జోడినా లేక రీల్ జోడినా అన్నది ఇప్పటివరకు అభిమానులకు సరైన క్లారిటీ లేదు.

అయితే మీరు రియల్ లైఫ్ లో ఒక్కటైతే చూడాలని అనుకునేవారు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో రవి కృష్ణ నవ్య స్వామి తో రిలేషన్షిప్ గురించి స్పందించారు. సాధారణంగా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ అన్నవి ఉంటాయి. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కూడా ఉండదు. అటువంటి సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు రవి కృష్ణ. వయసు అయిపోవడం ఉండదని ప్రభాస్ గారికి వయసు అయిపోయింది అని చెప్పలేము కదా అని తెలిపాడు.

అనంతరం నవ్య స్వామి తో రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ.. మేము కొన్ని షోలకు కలిసి హాజరు కావడంతో ఈ కామెంట్లు వచ్చాయి. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఆమెతో ఒక సీరియల్ చేసిన తర్వాత నేను మరో సీరియల్ చేయలేదు అని చెప్పుకొచ్చారు రవి కృష్ణ. మా జంట హిట్ పెయిర్ షోలకు ఎక్కువగా పిలుస్తారని రవికిష్ణ చెప్పుకొచ్చారు. జనాలు కూడా మా జోడిని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అని చెప్పుకొచ్చాడు. చాలామంది మమ్మల్ని లవర్స్ అనుకుంటున్నారని, మీరు అనుకుంటున్నట్టుగా ఒకవేళ నవ్య స్వామి ప్రపోజ్ చేస్తే మాత్రం అప్పుడు చూద్దాం అని చెప్పుకొచ్చారు రవి కృష్ణ. కాగా రవి కృష్ణ మాటలు అని బట్టి చూస్తే నవ్య తో ప్రేమ పెళ్లి తనకు ఇష్టమే అని చెప్పకనే చెప్పేసాడు. ఇకపోతే తాజాగా విడుదలైన విరూపాక్ష సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు రవికృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -