Virtue: శాశ్వతమైన పుణ్యం లభించాలంటే చేయాల్సిన పని ఇదే!

Virtue: ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చితే భారత దేశ ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే భారత్ ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా పరిగణిస్తారు. ఇక్కడ అనేక కుల, మతాలు ఉంటాయి. అందుకు తగ్గట్టు ఆచారాలు కూడా పాటిస్తుంటారు. ఇతర మతాలతోపాటు హిందువులకు భక్తి భావన అధికమే. హిందువులు మట్టి నుంచి నీటి వరకు అన్నిటిని పూజిస్తారు.

అలానే దసరా రోజున గంగా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది. గంగాస్నానం చేసేటపుడు పవిత్రమైన నామం హర్ హర్ గంగా మైయా అంటూ గంగా నదిలో మూడు సార్లు లేదా ఐదు సార్లు స్నానం చేయాలి. గంగాస్నానం చేసిన తరువాత పేదలకు ఆహారం, నీరు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా శాశ్వతమైన పుణ్యం కూడా లభిస్తుంది.

 

పురాణాల ప్రకారం గంగా దసరా రోజున గంగామాత భూమిపైకి వచ్చింది. ఆమె భూమిపైకి రావడంతో, భగీరథుని పూర్వీకులందరూ మోక్షాన్ని పొందారు. ఈ రోజున మోక్షదాయిని గంగలో స్నానం చేయడానికి భక్తులు మతపరమైన నగరాలకు తరలి రావడానికి ఇదే కారణం అని అంటున్నారు. కాశీలోని అన్ని ఘాట్‌ల వద్ద ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి ఆచరిస్తారు. ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం హరి ద్వారం కాబట్టి మంచిదని పండితులు చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -