Vasthu: అదృష్టం కలిసిరావాలంటే చేయాల్సిన పని ఇదే.. ఏం చేయాలంటే?

Vasthu: ఒకప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించి పాజిటివ్ ఎనర్జీతో ఇంటిని నింపాలి అంటే వాస్తు శాస్త్రం వైపు ఎక్కువగా చూసే వాళ్ళం. కానీ నేటి ఆధునిక యువత ఎక్కువగా ఫెంగ్ షుయ్ అనే సాంప్రదాయ చైనా వాస్తు శాస్త్రం మీద ఎక్కువగా ఆసక్తిని కనిపిస్తున్నారు. నిజానికి ఈ చైనా వాస్తు కన్నా మన వాస్తు చాలా పురాతనమైనది.

కానీ ఎందుకో నేటి యువత చైనా వాస్తు మీదే ఎక్కువ దృష్టి పెట్టి ఆ శాస్త్రం ప్రకారమే ఇంటిలోని గృహాలంకరణ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే చైనా సంప్రదాయ శాస్త్రం ఇంట్లో అద్దాలు ఏ దిక్కున పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారో చెబుతుంది. అదృష్టం కలిసి రావాలంటే ఇలా చేయండి అంటూ కొన్ని సూచనలు ఇస్తుంది.

 

అవేంటో చూద్దాం రండి. ఇంటిలో అద్దాన్ని డైనింగ్ హాల్ ఎదురుగుండా పెట్టుకుంటే మంచిదంట. అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఆహార పదార్థాలు వడ్డించుకునే ఆహార పదార్థాలు అన్నీ అద్దంలో కనబడే లాగా పెట్టుకోవాలని మాట. అలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి ఇల్లంతా పాజిటివ్గా ఉంటుందని చెప్తుంది ఈ శాస్త్రం.

 

అదే విధంగా బయటనుంచి ఇంటి లోపలికి వచ్చిన తరువాత వారికి కనిపించే విధంగా ఒక అద్దం పెట్టాలి. అలా చేయటం వల్ల వాళ్లతో వచ్చిన నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందంట. అలా అని గుమ్మానికి ఎదురుగా అద్దం పెడితే అది మళ్లీ నెగటివ్ ఎనర్జీని ఇస్తుందట ఎందుకంటే బయటి నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పాజిటివ్ ఎనర్జీ చాలా ఫాస్ట్ గా గుమ్మానికి ఎదురుగా ఉన్న అద్దం బయటికి పంపిస్తుందని చెప్తున్నారు చైనా వాస్తు నిపుణులు.

 

అదేవిధంగా హాల్లో పడే వెలుగుని ఒక అద్దం మీద పడేటట్లుగా చేసి ఆ వెలుగు హాల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయడం వల్ల కూడా అటు పాజిటివ్ ఎనర్జీ తో పాటు ఆర్థికంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే బెడ్రూంలో బెడ్ ఎదురుగా అద్దం పెడితే నెగటివ్ ఎనర్జీ వస్తుందట అందుకే బెడ్ కి పక్కగా అద్దం పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తో పాటు ధనాకర్షణ కూడా కలుగుతుందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -