Tollywood: కృష్ణ రెండో పెళ్లి తర్వాత అలాంటి గొడవలు జరిగాయా?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి, ఎన్నో నిర్మాణ సంస్థలకు అండగా నిలిచిన నిజమైన సూపర్ స్టార్ కృష్ణ. సినిమాను, నిర్మాతను ఎంతగానో గౌరవించే కృష్ణ.. ఎన్నో విజయాలను అందుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో భారీ హిట్లు ఉన్నాయి. ఇలా సినిమాలు చేస్తున్న క్రమంలోనే వీరిద్దరికి ప్రేమ కలగడం, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది.

 

అప్పటికే కృష్ణకు, విజయనిర్మలకు విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి. అయితే కృష్ణ తన భార్య ఇందిరాదేవి ఉండగానే, ఆమెతో ఒక్కమాట కూడా చెప్పకుండా విజయనిర్మలను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఇందిరాదేవికి దీని గురించి చెప్పారు. కాగా విజయనిర్మల, కృష్ణలు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగిందో కృష్ణ తమ్ముడు ఆది శేషగిరారావు వివరించారు.

 

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆదిశేషగిరిరావు.. అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మల పెళ్లి చేసుకొని. ఇంటికి రాగా అప్పుడు ఏర్పడిన పరిస్థితిని తన తల్లి బాగా డీల్ చేసినట్లు ఆదిశేషగిరిరావు వెల్లడించారు. కృష్ణ వ్యక్తిగత విషయం కాబట్టి ఆ విషయంలో తాను ఏమీ చెప్పలేదని ఆదిశేషగిరిరావు తెలిపారు.

కానీ కృష్ణ హఠాత్తుగా పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత కాస్త సందిగ్ధం ఏర్పడిందని, అప్పుడు తన తల్లికి అండగా నిలిచి దానికి పరిష్కారం చూపించడంలో సహకరించినట్లు ఆదిశేషగిరిరావు వెల్లడించారు. ఇక తన వదిన, కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి పరిస్థితిని అర్థం చేసుకొని వారి పెళ్లిని ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -