Tollywood: వర్షం, బాద్ షా.. విజేత ఆ సినిమానేనా?

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో కాలంగా రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను తమ అభిమాన హీరో పుట్టిన రోజు లేదా సినిమాకు సంబంధించి ప్రత్యేక తేదీల్లో థియేటర్లలో సినిమాలను రీ రిలీజ్ చేస్తారనే విషయం తెలిసిందే. దీంతో మరోసారి తమ అభిమాన హీరో సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమా రీ రిలీజ్ అయినా.. రికార్డులు బ్రేక్ చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమా కూడా పీక్స్ లోకి వెళ్లింది. బాలయ్య బాబు నటించిన ‘చెన్న కేశవ రెడ్డి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అభిమానులను అలరించే క్రమంలో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయా హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు. అయితే రీ రిలీజ్ విషయంలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు.

 

 

ఇప్పటివరకు ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో ఒకటి ‘రెబల్’, రెండోది ‘బిల్లా’ మూవీ. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ వంటి బ్లాక్ బస్టర్‌ను వదిలేసి.. ఫ్లాప్ సినిమాను రీ రిలీజ్ చేయడంపై అప్పట్లో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ప్రభాస్ సినీ కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్-త్రిష జోడిగా నటించిన ‘వర్షం’ సినిమాను నవంబర్ 11వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కొందరు అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుండగా.. మరికొందరు ఛత్రపతి వంటి సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కూడా ‘ఆది, సింహాద్రి’ సినిమాలు రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నవంబర్ మూడో వారంలో ‘ఆది’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ‘బాద్ షా’ పేరు తెరపై వినిపిస్తోంది. నవంబర్ 19న ‘బాద్ షా’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. అయితే వారం రోజుల వ్యవధిలో రెండు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ReplyReply allForward

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -