Tollywood: ఈ స్టార్ హీరోల ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిందా?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పోటీపడుతున్నారు. స్టార్ హీరోలుగా అవ్వడం కోసం వారు ఎంతగానో కష్టపడుతున్నారు. తమ నటనతో ఫ్యాన్స్ కు దగ్గరై ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. అయితే వారు నటించిన కొన్ని సినిమాలు అంతగా ఆశించిన ఫలితాలను పొందలేదు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న కొందరి హీరోల మొదటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

 

తొలి సినిమాలతో ఫ్లాప్ రిజల్ట్ ను, యావరేజ్ రిజల్ట్ ను కొందరు హీరోలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం భారీ విజయాలను అందించాయి. ఆ సక్సెస్ తోనే ఫ్యాన్స్ కు వారు దగ్గరయ్యారని చెప్పాలి. బాల నటుడిగా బాల రామాయణంలో నటించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని అనే సినిమా చేశారు. వీఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గర కాలేదని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నంబర్1 సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.

 

అలాగే స్టార్ హీరో ప్రభాస్ తెలుగు తెరకు ఈశ్వర్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రభాస్ ఊరమాస్ లుక్ లో కనిపించగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఆ తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు.

 

అక్కినేని వంశం నుంచి నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. వైఎస్సార్ మరణించిన టైంలో ఈ సినిమా విడుదల కావడంతో అది మసినిమాకు మైనస్ అయ్యింది. మంచు విష్ణు ఫస్ట్ మూవీ విష్ణు, వరుణ్ తేజ్ ముకుంద, అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్, కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే, గోపీచంద్ తొలివలపు వంటి సినిమాలు వారికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత వారు చేసిన సినిమాలు మాత్రం విజయాన్ని అందించాయి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -