Tollywood: ప్రభాస్‌ను దేవుడిలా భావించే వ్యక్తి ఎవరో తెలుసా?

Tollywood: టాలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్‌లలో ప్రభాస్ శ్రీను కూడా ఒకడు. ఇప్పటికే 150కి పైగా సినిమాలలో నటించి నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే అతడి అసలు పేరు శ్రీను మాత్రమే. శ్రీను స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నరసన్నపేట. సినిమాల మీద ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకునేవాడు. అప్పుడు ప్రభాస్ అతడి బ్యాచ్‌మేట్‌గా ఉండేవాడు.

అయితే ప్రభాస్ హీరోగా మారిన తర్వాత ప్రభాస్ పనులన్నీ శ్రీను చూసుకునేవాడు. సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలో శ్రీను ప్రభాస్‌కు తోడుగా ఉండేవాడు. అతడికి సినిమాలంటే ఇష్టం ఉండటంతో సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించాడు. దీంతో అతడికి ప్రభాస్ శ్రీను అని పేరు పెట్టేశారు. 2003లో హరికృష్ణ నటించిన సీతయ్య సినిమాతో ప్రభాస్ శ్రీను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం, చక్రం సినిమాల్లో కూడా నటించాడు.

ఆయా సినిమాల్లో శ్రీను నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా సినిమా అవకాశాలను సంపాదించాడు. కమెడియన్‌గా దర్శకులకు మంచి ఛాయిస్ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయ్యాడు. శ్రీను చాలావరకు ప్రభాస్ సినిమాల్లోనే నటించాడు. ప్రభాస్ అంటే అతడికి చాలా ఇష్టం. ప్రభాస్‌ వల్లే తన కెరీర్ నిలబడిందని.. అందుకే ఆయన్ను దేవుడిలా కొలుస్తానని ప్రభాస్ శ్రీను పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. ఇటీవల కార్తీకేయ-2 సినిమాతో అలరించిన ప్రభాస్ శ్రీను చేతిలో ఇప్పుడు అరజడను పైగా సినిమాలు ఉన్నాయి.

ప్రభాస్ శ్రీను ఏం చదివాడు?
ప్రభాస్ శ్రీను ఇంటర్ ఫస్టియర్ చదివేందుకు అప్పట్లో హైదరాబాద్ వచ్చాడు. కానీ అటెండెన్స్ సరిగ్గా లేకపోవడంతో కాలేజీ నుంచి బయటకు పంపేశారు. అలా అతడు ఇంటర్ పాస్ కాలేదు. ఆ తర్వాత పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యాడు. పాలిటెక్నిక్ పాసైనా సర్టిఫికెట్ మాత్రం రాలేదు. ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నాడు. ప్రభాస్ దగ్గర పనిచేసేటప్పుడు ఆయన భలే సరదాగా ఉండేవారని ప్రభాస్ శ్రీను వెల్లడించాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -