Tollywood: మూడ్ వస్తే అలా చేస్తానన్న రష్మిక.. ఓరి నీ వేషాలో అంటూ?

Tollywood: పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన తన క్రేజ్, రేంజ్‌ని భారీ స్థాయిలో పెంచుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. నేషనల్ క్రష్‌గా మారి ప్రస్తుతం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఈ భామ మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు మరీ దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. మాల్దీవుల నుంచి రిటర్న్ వచ్చాక కూడా తన జోరు తగ్గించుకోలేదు. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. రష్మిక ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. అయితే రష్మికకు మాత్రం ట్రోలింగ్ బాధ తప్పడం లేదు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పెట్టినా.. లేదా వీడియో షేర్ చేసినా.. రష్మిక ట్రోలింగ్‌కు గురవ్వడం కామన్ అయింది. దానికి ఆమె కూడా ఘాటుగానే కౌంటర్ వేస్తుంటారు.

 

అయితే తాజాగా రష్మిక మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆమె మాట్లాడుతూ.. ‘నేనంటే మీకెందుకంత ప్రాబ్లమ్.. నాపై ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు? నేనేం తప్పు చేశారు? ఒక వేళ తప్పు చేస్తే తిట్టండి. అంతే కానీ మీ అంతలా మీరు ఊహించుకుని వార్తలు రాయకండి. నన్ను బాధ పెట్టకండి. ఇలాంటి విషయాలపై నేను రెస్పాండ్ అవ్వొద్దని అనుకున్నా.. కానీ ప్రతిసారి ట్రోలింగ్ బారిన పడటం నచ్చట్లేదు. దానికి నా మనసు అంగీకరించట్లేదు. ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను పట్టుకుని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.’ అని నెటిజన్లపై ఫైర్ అయింది. అయితే రీసెంట్‌గా రష్మిక తన అభిమానులకు ఓ సజేషన్ ఇచ్చింది. ‘నేను బాధలో ఉన్నా.. కోపంలో ఉన్నా.. హ్యాపీగా ఉన్నా.. మూడ్‌లో ఉన్నా.. వ్యాయామం చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేస్తే.. మీ మనసు ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నా మూడ్ ఎలా ఉన్నా.. నేను వ్యాయామం చేస్తాను. నిద్ర లేచిన మరుక్షణమే నా మైండ్‌లో వ్యాయామం చేయాలనే అనిపిస్తది. మీకు కూడా వ్యాయామం అలవాటు లేకపోతే.. కచ్ఛితంగా అలవాటు చేసుకోండి.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రాసుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

AP Volunteers: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. వైసీపీకి కొత్త శత్రువులు అవసరమే లేదుగా!

AP Volunteers: శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే కూతరు రూపంలోనో.. చెల్లెలు రూపంలో మన చుట్టూనే తిరుగుతారని ఓ సినిమాలో రావు రమేష్ అంటాడు. అక్కడ హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చింది...
- Advertisement -
- Advertisement -