Tollywood: వెంకటేష్ భార్య బయటకు రాకపోవడానికి కారణాలివేనా?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. తెలుగు ప్రేక్షకులను కొన్ని దశాబ్దాల పాటు తన నటనతో అందరికీ మంత్రముగ్దుల్ని చేసిన వెంకటేష్.. ఇప్పటికీ టాలీవుడ్ లో తన హవాను కొనసాగిస్తున్నాడు. మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. సోలో హీరోగా కూడా వెంకటేష్ అదరగొట్టేస్తున్నాడు.

టాలీవుడ్ లో ఎంతో పేరున్న కుటుంబాల జాబితాలో రామానాయుడు కుటుంబం కూడా ఒకటి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామా నాయుడు కుటుంబానికి చెందిన వారంతా సెటిల్ అయ్యారు. రామానాయుడు ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వారు. ఆయన కొడుకు సురేష్ కూడా ప్రొడ్యూసర్ గా ఉండగా, మరో కొడుకు వెంకటేష్ తెలుగులో హీరోగా కొనసాగుతున్నాడు.

మామూలుగా అయితే సినీ తారల కుటంబాల గురించి, కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడూ మనకు లైమ్ లైట్ లో కనిపించరు. ఏ సినిమా ఫంక్షన్ లో కానీ మరోచోట కానీ వెంకటేష్ భార్య మాత్రం అస్సలు కనిపించరు. అసలు దీనికి కారణం ఏంటనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

వెంకటేష్ భార్య నీరజ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్లు ఉన్నప్పుడు మినహా మిగితా ఎప్పుడూ బయటకు రారు అనేది టాక్. అయితే నీరజకు మీడియా ఫోకస్ ఇష్టం లేదని అందుకే ఆమె బయటకు పెద్దగా రారు అని వెంకటేష్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారి మాట. కాగా మదనపల్లెకు చెందిన వస్త్ర వ్యాపారి సుబ్బారెడ్డి కూతురు నీరజను వెంకటేష్ డిసెంబర్ 13, 1987న పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలోని విజయ శేషమహల్ లో వీరిద్దరి పెళ్లి జరిగింది.

తెలుగులో రీసెంట్ గా వెంకటేష్ ఎఫ్3తో మంచి హిట్ అందుకోగా.. ‘ఓరి దేవుడా’లో వెంకటేష్ కీలక పాత్ర పోషించాడు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్.. గురు, ఎఫ్2, వెంకీ మామ, నారప్ప, దృశ్యం2 లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -