YS Jagan Mohan Reddy: బెజవాడ ఎంపీగా ఆ హీరోని నిలబెట్టనున్న జగన్మోహన్ రెడ్డి?

YS Jagan Mohan Reddy: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ గురించి.. బెజవాడ రాజకీయాల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో సగం వరకు రాజకీయం బెజవాడలోనే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా బెజవాడ ఎంపీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది.

బెజవాడ ఎంపీ స్థానాన్ని గెలవడం అంటే.. చాలా కష్టంగా కూడుకున్న పని. ఒకవేళ బెజవాడ ఎంపీ స్థానాన్ని ఎవరైనా గెలిచారా.. వారికి సీఎం లెవెల్లో ఆదరణ దక్కుతుందని చెప్పవచ్చు. ఇక రాజకీయంగా ఆంధ్రాలో వైసీపీ జగన్ అధికారులకు వచ్చినప్పటికీ.. విజయవాడలో ఎంపీ సీట్ మాత్రం వైసీపీ సంపాదించుకోలేకపోతుంది. గత రెండు ఎన్నికల్లో కూడా వైసీపీ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది.

కానీ ఈసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెజవాడ ఎంపీ స్థానం చాలా ప్రత్యేకమైనది. కనుక సీఎం ఈసారి బెజవాడలో వైసీపీ జెండాను ఎలాగైనా పాతాలని పూనుకున్నట్లు తెలుస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా మంత్రి కేశినేని నాని టిడిపి తరఫున గెలిచాడు.

ఎంతో కష్టపడి ఎంపీ స్థానానికి ట్రై చేసినా.. వైసీపీకి దక్కలేదని చాలా కసితో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి గురి తప్పకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ స్థానానికి స్కెచ్ వేస్తున్నాడట. ఇందులో ఇంకో విషయం ఏమిటంటే.. ఎంపీ స్థానంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన ఒక టాలీవుడ్ స్టార్ హీరోని నిలబెడతాడు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అనేది అర్థం కావడం లేదు. మరి నిజంగానే విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి జగన్ ఒక స్టార్ హీరోని దింపుతాడా అనేది తెలియాలి అంటే.. వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా ఈసారి మాత్రం విజయవాడ ఎంపీ సీట్ ను జగన్ ప్రభుత్వం కొల్లగొట్టేలా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -