Star Heroes: టాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తుల లెక్కలివే.. ఏ స్టార్ హీరో ఆస్తుల విలువ ఎంతంటే?

Star Heroes: చలనచిత్ర రంగానికి రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటారు ఆ తరంలో వాళ్ళిద్దరూ టాప్ హీరోలు. ఆ తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటివాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలేరు. ఆ తరువాత తరంలో వచ్చి దుమ్ము దులిపిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఆ తరానికి వీళ్లే స్తంభాలు. అయితే సంవత్సరాలు తరబడి టాప్ హీరోలుగా ఎవరి జోనర్లో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళ ఆస్తులు ఏ మాత్రం ఉంటాయో అంటూ జనాలు ఆసక్తి కనబరచడం సహజమే.

అయితే నవతరం స్టార్ హీరోలుగా పేర్లు సంపాదించుకున్న రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్,మహేష్ బాబు లాంటి స్టార్ల సంపాదన వందల కోట్ల లోనే ఉంటుంది. వారి సంపాదన విషయం పక్కన పెడితే అందరికీ ఈ నలుగురి ఆస్తుల వివరాల మీదే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. అందుకే అంచనాగా వారి ఆస్తి ఎంత ఉంది అని అంచనా వేస్తే విక్టరీ వెంకటేష్ కి దాదాపు 6000 కోట్లు ఆస్తి ఉన్నట్టు లెక్క తేలింది. ఇందులో స్టూడియోలు నిర్మాణ సంస్థ, పంపిణీ మరియు ఉమ్మడి ఆస్తులు కలుపుకొనిఈ లెక్క తేలింది.

నిర్మాత కొడుకుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయకుడిగా ఎదిగి మహిళా ప్రేక్షకుల భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఘనత విక్టరీ వెంకటేష్ ది. ఇక చిరంజీవి కామన్ మ్యాన్ గా సినిమాలలో అడుగుపెట్టి 150 సినిమాలు తీసినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గని నటుడు. ఈయన సుదీర్ఘ కెరియర్లో ఫామ్ హౌస్లు,ఇండ్ల స్థలాలు, పొలాలు, లగ్జరీ కార్లు అన్ని కలుపుకొని ఐదు వేల కోట్లు నికర ఆస్తి ఉన్నట్లుగా అంచనా.

అలాగే నాగార్జునకి 4000 కోట్ల నుంచి 6000 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని అంచనా. ఈయనకు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి కొంత ఉంది. ఈయనకి నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ లో పెట్టుబడులు, ఎన్ కన్వెన్షన్ లాంటి భారీ ఆదాయ అర్జన కలిగి ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇక నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ హిట్లమీద హిట్లు పడుతూ కుర్ర హీరోలకి గట్టి పోటీని ఇస్తున్న బాలకృష్ణ నికర ఆస్తి నాలుగువేల కోట్లు పై మాటే. అయితే ఈ లెక్కలు అన్ని అఫీషియల్ గా ఉన్న లెక్కలు కాదు, అంచనా మాత్రమే.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -