Tollywood: ఈ హీరోలు సక్సెస్ కాకపోవడానికి అసలు కారణాలివేనా?

Tollywood: సినిమా ఇండస్ట్రీలో కొంత మంది సక్సెస్ అవుతారు. మరికొందరు సక్సెస్ కాలేరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా సక్సెస్ కాలేకుండా వెనుదిరిగిన సందర్భాలున్నాయి. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఈ ఇండస్ట్రీలో కొనసాగకుండా ఉన్న యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

దాసరి అరుణ్ కుమార్:
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు అయిన అరుణ్ కుమార్ అప్పట్లో గ్రీకువీరుడు వంటి సినిమా చేశాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. ఇటీవలె అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం సినిమాలో విలన్ గా కూడా చేశాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించాడు.

ఆర్యన్ రాజేష్:
డైనమిక్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ కొడుకుగా ఆర్యన్ రాజేష్ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఆయన సినిమాలు హాయ్, లీలామహల్ సెంటర్, సొంతం, ఎవడిగోల వాడిదే, నిరీక్షణ, నువ్వంటే నాకిష్టం వంటివి అప్పట్లో మంచి ఆదరణను పొందాయి. ఆ తర్వాత ఆయన సినిమాల జోలికి రాలేదు. అయితే ఈ మధ్యనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు.

గౌతమ్:
కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ అప్పట్లో పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వారెవా, బసంతి, మను సినిమాలు చేసి ఊరుకున్నారు.

రమేష్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు కొన్ని సినిమాల్లోనే కనిపించి కనుమరుగయ్యారు. ఆ తర్వాాత మహేష్ బాబు హీరోగా చేసిన అతిథి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

విక్రమ్:
బ్రహ్మానందం తర్వాత కామెడీ ఆ స్థాయిలో పండించే నటుల్లో ఎమ్మెస్ నారాయణ కూడా ఉన్నారు. ఆయన కొడుకైన విక్రమ్ కూడా కొడుకు అనే టైటిల్ తో సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.

అక్కినేని అఖిల్:
నాగార్జున, అమల కొడుకు అయిన అక్కినేని అఖిల్ మనం సినిమాతో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అంతకుముందు సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నారు.

తారకరత్న:
నందమూరి వంశం నుంచి వచ్చిన తారకరత్న సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయాడు. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న సినిమాలు కొంత విజయాన్ని అందించాయి. ఆ తర్వాత ఆయనకు విజయాలు దక్కలేదు. అమరావతి అనే సినిమాలో ఆయన విలన్ గా చేశారు. నారా రోహిత్ సినిమాలో కూడా ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

సుశాంత్:
అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుశాంత్ కాళిదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కరెంట్, ఆటాడుకుందాం రా వంటి సినిమాలు చేశారు. చిలసౌ సినిమాతో హిట్ టాక్ అందుకున్నారు. ఆ తర్వాత అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా చేశారు.

అల్లు శిరీష్:
అల్లు ఫ్యామిలీ నుంచి బన్నీ తర్వాత అల్లు శిరీష్ గౌరవం అనే సినిమా ద్వారా వచ్చారు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలు చేశారు. ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.

మంచు విష్ణు:
మంచు విష్ణు కూడా వరుస విజయాలను అందుకోలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఇటీవలె జిన్నా సినిమాతో ముందుకు వచ్చినా

 

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక...
- Advertisement -
- Advertisement -