Tollywood: వామ్మో.. ఈ ఏడాది ఇంతమంది సెలబ్రిటీలు మృతి చెందారా?

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది అనగా 2022లో ఎంతోమంది సెలబ్రిటీలు భువికెగిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మహేష్ బాబు కుటుంబం కోలుకోలేని విధంగా ఈ ఏడాదిలోనే ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు. మరి 2022లో మృతి చెందిన సెలబ్రిటీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టుగా తెలియని ప్రారంభించిన రమేష్ బాబు బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ప్రముఖ దర్శకుడు శరత్ క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలు విడిచాడు. ఏప్రిల్ 9వ తేదీన నటుడు బాలయ్య మరణించారు. అలాగే ఏప్రిల్ 20 న మరొక దర్శకుడు అయినా తాటినేని రామారావు కూడా తుది శ్వాస విడిచారు. అదేవిధంగా టాలీవుడ్ లెజెండరీ నటుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల సెప్టెంబర్ 11 న మరణించిన విషయం తెలిసిందే. తన 50 ఏళ్ల సినీ ప్రస్తావనంలో ఎన్నో సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణంరాజు. సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా విజయం సాధించారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించింది. ఆ మరణ వార్త నుంచి మహేష్ బాబు కోలుకోకముందే నవంబర్ 15న నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మరణించారు.

 

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలా ఈ ఏడాది మహేష్ బాబు ముగ్గురిని కోల్పోయాడు. మొదట అన్నా తర్వాత తల్లి ఆ తర్వాత తండ్రి ఇలా వరుసగా మహేష్ బాబుకు కోలుకోలేని దెబ్బలు ఎదురయ్యాయి. అదేవిధంగా ఏడాది డిసెంబర్ నెలలో నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23 న మరణించిన విషయం తెలిసిందే. తెలుగులో దాదాపుగా 750 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు. అయితే సత్యనారాయణ మరణం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కోలుకోకముందే ప్రముఖ నటుడు చలపతిరావు కూడా మరణించారు. ఆయన కూడా దాదాపుగా 600కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇక తాజాగా డిసెంబర్ 29న ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ అనారోగ్యం కారణంగా మరణించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -