Suma: సుమపై నెట్టింట దారుణంగా ట్రోల్స్.. దిగజారారంటూ?

Suma: ఇటీవల సమంతతో యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. సమంత నటించిన యశోద మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యాంకర్ సుమపై నెట్టింట ట్రోలింగ్, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సమంత ఆరోగ్యం విషయమై పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడం, సమంత కన్నీటిపర్యంతమయ్యేలా చేయడం సుమకు తగదని నెటిజన్లు, సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

యశోద మూవీ రిలీజ్ నేపథ్యంలో సమంత స్టార్ డమ్ ఆధారంగా కోట్ల రూపాయలు నిర్మాత వెచ్చించారు. అందుకు తగ్గ బిజినెస్ చూసేలా ప్రమోషన్లు చేయాలంటూ సమంతపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తన వ్యక్తిగత ఆరోగ్యం గురించి కూడా సమంత ప్రకటన చేసి ప్రేక్షకులు ఆకర్షితులయ్యేలా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో సమంతను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ సుమ.. పలు ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నలే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. సమంత ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నొప్పించేలా ప్రశ్నలు వేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు తను ఉన్న పరిస్థితికి ఇంటర్వ్యూకు ఒప్పుకోవడమే గ్రేట్ అని, అలాంటిది ఇలా అవమానపరిచేలా ప్రశ్నలు అడిగి ఉండరాదని చెబుతున్నారు.

 

సుమ విషయాన్ని గుర్తు చేస్తున్న నెటిజన్లు..
ఒకప్పుడు సుమ కూడా గొంతు సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో సుమపై వివిధ మాధ్యమాల్లో దుష్ప్రచారం జరిగింది. సుమకు గొంతు క్యాన్సర్ అంటూ కథనాలు వెలువడ్డాయి. సమంతతో ఇంటర్వ్యూ సందర్భంగా సుమ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సమంత ఎమోషనల్ అయ్యింది. కన్నీరు కూడా కార్చింది. సమంతను మరింత బాధపెట్టేలా సుమ ప్రశ్నలున్నాయని ఫ్యాన్స్ మండిపడ్డారు. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -