Vaishnavi Chaitanya: ఒక్క సక్సెస్ కే వైష్ణవి చైతన్యకు ఇంత పొగరా.. ఈ ఆటిట్యూడ్ తో ఇండస్ట్రీలో కష్టమంటూ?

Vaishnavi Chaitanya: యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ,షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్య అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు కెరియర్ మొదట్లో సినిమాలలో చెల్లెలు పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నటువంటి అనంతరం బేబీ సినిమాకు ఏకంగా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ.

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈమె తదుపరి సినిమాలకు సంతకం పెట్టాలి అంటే దర్శక నిర్మాతలకు భారీగానే కండిషన్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట.

 

ఇలా వరుస అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో వైష్ణవి చైతన్య సైతం ఒక్కో సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా తాను సంతకం పెట్టాలి అంటే ముందుగా అడ్వాన్స్ తనకు ఇవ్వాలని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే సినిమాకు సైన్ చేస్తాను అని కండిషన్స్ పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సాధారణంగా చాలామంది హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఫాలో అవుతుంటారు.

 

ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అవకాశాలు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుంటూ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కూడా ఇలాంటి చేస్తున్నారని తెలియడంతో కెరియర్ మొదట్లోనే ఇలాంటి కండిషన్స్ పెడితే కెరియర్ లో ముందుకు వెళ్లడం కష్టమని, ఇంత పొగరు చూపించడం కెరియర్ పైనే కోలుకోలేని దెబ్బ కొడుతుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -