Baby: బేబీ మూవీ రీ రిలీజ్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధ్యమవుతాయా?

Baby: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి ఆదరణ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో మరికొన్ని ప్రేమకథ సినిమాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే గత ఏడాది జూలై 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కల్ట్ లవ్ స్టోరీ బేబీ సినిమాని కూడా తిరిగి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ట్రయాంగిల్ ప్రేమ కథ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కేవలం ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరోజు మాత్రమే ప్రసారం కాబోతుంది అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా మంగళవారం ఓపెన్ కానున్నాయి.

 

ఒకానొక సమయంలో థియేటర్లో విడుదలై అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి బేబీ సినిమా ఇప్పుడు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా కేవలం 10 కోట్ల బడ్జెట్తో 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతుందని తెలిసి అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -