Vaishnavi Chaitanya: కలలో కూడా ఊహించని ఆఫర్ అందుకున్న బేబీ హీరోయిన్.. అదృష్టవంతురాలు అంటూ?

Vaishnavi Chaitanya: బేబీ సినిమా హిట్ అవడం హీరోలు ఆనంద దేవరకొండ,విరాజ్ అశ్విన్లకు ఏమాత్రం కలిసొచ్చిందో తెలియదు కానీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కి మాత్రం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే ఆమె రెండు సినిమాలకు కమిటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కలలో కూడా ఊహించని ఆఫర్ అందుకొని ఇండస్ట్రీ తనువైపు చూసేలా చేసుకుంది ఈ భామ. తాజాగా ఇండస్ట్రీలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే వైష్ణవి చైతన్య త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా ఛాన్స్ కొట్టేసిందని సినీ వర్గాల టాక్. అదేమిటంటే దివంగత సహజనటి సౌందర్య బయోపిక్ లో మెయిన్ లీడ్ లో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. వైష్ణవి అచ్చ తెలుగు అమ్మాయి చూడటానికి కూడా ఆమెది చక్కని రూపం, చక్కగా నటించగలదు. అలాగే యాక్టింగ్, డాన్సింగ్ పరంగా చాలా రాటుదేరింది. బేబీ సినిమాలో తీన్మార్ డాన్స్ ఎంత బాగా వేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

అంత టాలెంట్ ఉంది కాబట్టే ఈ ముద్దుగుమ్మకు ఈ అద్భుతమైన అవకాశం దక్కింది అంటున్నారు సినీ వర్గాల వారు. వైష్ణవి చైతన్య అయితే సౌందర్య పాత్రకు బాగా సరిపోతుందని మేకర్స్ కచ్చితంగా అనుకుంటున్నారట. ఈమె చాలా ట్రెడిషనల్ బ్యూటీ కావడం, చూడటానికి చక్కగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. సౌందర్య చాలామంది అభిమానులకు ఇష్టమైన హీరోయిన్.

ఆమె బయోపిక్ వస్తే కచ్చితంగా 100 కోట్లు క్రాస్ చేయడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది. ఒకవేళ ఈ బయోపిక్ నిజంగా తీస్తున్నట్లయితే అందులో వైష్ణవి చైతన్య సెలెక్ట్ అయితే ఇది ఆమె చేతిలో ఒక మైలురాయి అవుతుంది. కీర్తి సురేష్ కి మహానటి ఎలాంటి పేరు తీసుకువచ్చిందో, వైష్ణవి చైతన్య కి ఈ సినిమా అంత పేరు తీసుకువస్తుంది అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -