Satya Prakash: ఆ నటుడు రేప్ చేశాడని చిరంజీవికి ఫిర్యాదు చేసిన నటి సౌందర్య.. ఏం జరిగిందంటే?

Satya Prakash: ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సత్య ప్రకాష్ ఒకరు. ఈయన తెలుగు మాత్రమే కాకుండా భోజ్ పురి హిందీ సినిమాలలో కూడా నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగులో ఈయన దాదాపు 20 సినిమాలకు పైగా విలన్ పాత్రలలో నటించారు. ఇక సత్య ప్రకాష్ సినిమాలలో చేస్తున్నారు అన్నా లేకపోతే సినిమాలో ఏదైనా రేప్ శీను ఉంది అంటే ఈయననే మేకర్స్ సంప్రదించేవారు.

ఇలా ఎన్నో రేప్ సన్నివేశాలు ఉండే సినిమాలలో సత్య ప్రకాష్ నటించారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఇదే విషయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి మీరు ఎన్నో సినిమాలలో ఇలాంటి సన్నివేశాలలో నటించారు కదా ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు మీకు ఎలా ఉండేది ఏమి ఇబ్బంది కలగలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సత్య ప్రకాశ్ సమాధానం చెబుతూ తనకు ఇలాంటి సినిమాలలో నటించడం ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ నేను ఫలానా సీన్ చేయను ఫలానా సినిమా చేయను అని చెప్పడానికి నాకు అంత స్తోమత లేదు.

ఇలా ఇలాంటి సీన్స్ చేయలేనని చెప్పలేకపోవడం వల్లే తాను తప్పనిసరి పరిస్థితులలో రేప్ శీన్ లలో నటించానని ఈయన తెలియచేశారు. అప్పట్లో నగరంలోకి పెద్ద రేపిస్టు వచ్చాడు అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి న్యూస్ పేపర్లో మా సినిమా గురించి రాసేవారని తీరా చదివితే ఫలానా సినిమాలో ఇలాంటి సన్నివేశంలో నటించారని మ్యాటర్ ఉంటుందని ఈయన తెలిపారు. ఇక సౌందర్య గారు మీ గురించి చిరంజీవి గారికి కంప్లైంట్ చేశారట నిజమేనా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సత్యప్రకాష్ సమాధానం చెబుతూ చూడాలని ఉంది సినిమాలో నేను చిరంజీవి సౌందర్య గారు మా ముగ్గురి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. నేను అన్నపూర్ణ స్టూడియోలోని ఓ సెట్ లో షూటింగ్ చేస్తుంటే పక్కనే చిరంజీవి గారు ఉన్నారని తెలిస్తే కలవడానికి వెళ్లాను. అప్పుడు చిరంజీవి పక్కనే సౌందర్య గారు కూడా కూర్చుని మాట్లాడుతున్నారు. అప్పుడు సౌందర్య, చిరంజీవి గారు నా కెరియర్ లో ఒకే ఒక్క సినిమాలో రేప్ జరిగింది. ఆ రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అంటూ నన్ను చూపించడంతో నేను ఆ సమయంలో దానిని ఒక కాంప్లిమెంట్ గా తీసుకున్నాను అంటూ సత్య ప్రకాష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -