Lavanya: మెగా కోడలు లావణ్య జాతకం అస్సలు బాలేదా.. ఆమె వల్లే వరుణ్ తేజ్ సినిమా ఫ్లాపా?

Lavanya: తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ఆ వార్తలపై ఈ జంట స్పందించలేదు. అంతేకాకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు.

అయితే ఎంగేజ్మెంట్ వేడుక జరగకముందు రెండు మూడు నెలల నుంచి కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించగా వార్తలపై ఇటు లావణ్య గాని అటు వరుణ్ గాని స్పందించలేదు. కానీ ఒకసారిగా ఎంగేజ్మెంట్ వేడుకతో ఆ వార్తలు అన్నింటికి చెక్ పెట్టేశారు. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి పెళ్లెప్పుడు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది లోపే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున.

 

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాకి, లావణ్య త్రిపాఠికి అంటగట్టి సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. లావణ్య, వరుణ్ తేజ్ల నిశ్చితార్థం తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమాని డిజాస్టర్ గా నిలిచింది. లావణ్య జాతకం అసలు బాగోలేదు. లావణ్య వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ కామెంట్లు చేయడంతో పాటు ఆ వార్తలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై హీరో వరుణ్ తేజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. కొందరు మెగా అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ అలాంటి కామెంట్లు చేసే వారిపై మండిపడుతున్నారు..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -