Venu Swamy: వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. రష్మిక దరిద్రానికి అసలు కారణమిదా?

Venu Swamy: ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో కొన్ని అతను చెప్పినట్టు జరగడంతో అతను మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందే ప్రకటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణు స్వామి అన్నట్టే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో జరగబోయే విషయాన్ని ముందే చెప్పుకొచ్చిన వేణు స్వామి ఇటీవల హీరోయిన్ రష్మిక మందనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రష్మిక మందన్న, రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకోమని చెప్పింది వేణు స్వామినే అంటూ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని ఒకవేళ ఆ నిశ్చితార్ధం తర్వాత పెళ్లి చేసుకుంటే ఆమె కెరియర్ నాశనం అవుతుందని జాతకంలో అలాగే రాసిందని వేణు స్వామి చెప్పుకొచ్చారట.అలా వేణు స్వామి చెప్పిన మాటలు విన్న రష్మిక అతగాడికి బ్రేకప్ చెప్పేసి ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. అయితే ఇదే క్రమంలో రష్మికకి ఆల్రెడీ వేణు స్వామి ఒక స్టార్ హీరో విషయంలో హెచ్చరించారని, అయినా కానీ ఆమె మాట వినకుండా అలా చేయడంతోనే ఇప్పుడు కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వేణు స్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 

రష్మిక,విజయ్ దేవరకొండకు దూరంగా ఉండటమే బెటర్ అని ఎప్పుడో చెప్పుకొచ్చాను. విజయ్ జాతకం ప్రకారం ఆయనతో ఎవరు కలిసిన సరే వాళ్ళ కెరియర్ నాశనం అయిపోతుంది. అదే విషయం నేను రష్మిక కు చెప్పాను. కానీ నా మాట వినలేదు. అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది . ఇప్పటికైనా రష్మిక ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండకు దూరం కావడమే మంచిది. లేకపోతే ఆమెకి దరిద్రం పట్టుకుంటుంది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి రష్మిక వేణు స్వామి మాటలు విని విజయ్ దేవరకొండకు దూరంగా ఉంటుందా?తన కెరియర్ ను నిలబెట్టుకుంటుందా లేదా చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -