Vijay Sethupathi: విజయ్ సేతుపతికి తాగుడు ఎలా అలవాటైందో తెలిస్తే నవ్వడం ఖాయం!

Vijay Sethupathi: తెలుగు సినీ ప్రియులకు విజయ్ సేతుపతి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక విజయ్ సేతుపతి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇతడు తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

ఆ తర్వాత విడుదలైన ఉప్పెన సినిమాలో రాయనం పాత్రలో విజయ్ నటనకు గాను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అడపాదడపా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ పలు భాషల్లో సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకు వెళుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ తనకు తాగుడు ఎలా అలవాటయిందన్న విషయాన్ని బయట పెట్టాడు.

ఇటీవల ఒక కాలేజ్ ఫంక్షన్ కు వెళ్లిన విజయ్ సేతుపతి నాకు మద్యం అలవాటు ఉందని దానికి కూడా ఒక రీజన్ ఉందని తెలిపాడు. ఆయనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో పెద్దగా చదువు ఎక్కలేదట. మార్కులు కూడా పెద్దగా రాలేదట. ఇక మూడు కాలేజీలకు అప్లై చేస్తే మూడు కాలేజీల్లో కూడా సీటు రాలేదట. ఇక ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న మద్యం సేవిస్తూ కనిపించాడు. ఆ విధంగా తనకు కూడా అప్పటినుంచి మద్యం అలవాటైందని విజయ్ చెప్పుకొచ్చాడు.

తాను అలవాటు చేసుకున్న అంత మాత్రాన ఇదొక మంచి పని కాదు.. అని యూత్ కి విజయ్ సలహా ఇచ్చాడు. అలా చదువులో ఫెయిల్ అయిన విజయ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలా దూసుకు పోతున్నాడు. అంతేకాకుండా హీరో అవ్వాలంటే అందంతో పనిలేదు.. టాలెంట్ ఉంటే చాలు అని విజయ్ నుంచి నేర్చుకోవచ్చు అన్న మాట వాస్తవం అని చెప్పవచ్చు. ప్రస్తుతం విజయ్ చెప్పిన మాటలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -