Ganapathi: ఈ గణపతిని దర్శించుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయట.. ఏమైందంటే?

Ganapathi: హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా మొదట విగ్నేశ్వరుని పూజించిన తర్వాతే ఆ పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన కార్యం పూర్తి అవ్వాలి అని మొదట గణపతిని పూజిస్తూ ఉంటారు. శుభకార్యం ఏదైనాప్పటికీ గణపతిని పూజించడం అన్నది ఎప్పటినుంచో వస్తోంది. అయితే ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా ప్రజలు వినాయకుడి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి మరీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మనం ఎక్కడికి వెళ్లినా కూడా విగ్నేశ్వరుడికి తొండం ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుడికి తొండం లేకుండా ఉందా వినాయకుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా!

తొండం లేకుండా విఘ్నేశ్వరుని ఊహించుకోవడానికి ఏదోలా ఉంటుంది కదూ. కానీ తొండం లేకుండా ఉన్న విగ్నేశ్వరుని ఆలయం ఒక ప్రదేశంలో ఉంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఏంటి అన్న విషయాల్లోకి వెళితే.. నరముఖ గణపతి ఆలయం తమిళనాడులో ఉంది. ఇక్కడికి నిత్యం భక్తులు వారిని దర్శించుకుంటూ ఉంటారు. పితృ దోషాలతో బాధపడే వాళ్ళు ఇక్కడకి వెళితే ఆ పితృ దోషం నుండి బయటపడి, సుఖంగా ఉండవచ్చు. తిలతర్పణపురి అనే గ్రామంలో ఈ స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వరార్ ఆలయం ఉంది. భారతదేశం అంతా తిరిగి ఎన్ని చోట్ల పిండాలు పెట్టినా, ముక్తి రాకపోవడంతో రాములవారు శివుడిని ప్రార్థించగా పరమశివుడు ఈ కొలనులో స్నానం చేసి, ఇక్కడ పితృతర్పణలు మొదలు పెట్టమని చెప్పారట.

 

అందుకే ఈ ఊరిని తిలతర్పణపురి అని అంటారు. తిల అంటే నువ్వులు. తర్పణం అంటే వదిలిపెట్టడం. రాములు వారు ఇక్కడ వదిలిపెట్టారు కనుక ఆ ఊరిని ఈ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. రాములవారు తన తండ్రి దశరధునికి నాలుగు పిండాలు పెట్టారు. ఆ తరవాత ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారారు. ఎవరైతే ఆలయం దగ్గరకు వచ్చి పిండ ప్రధానం చేస్తారో వాళ్లకి పితృ దోషం ఉండదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నర ముఖంతో ఉన్న గణపతి ఉంటారు. తొండం లేకుండా బాలగణపతి రూపంలో ఇక్కడ వినాయకుడు ఉంటారు. నరముఖ గణపతి లేదా ఆది వినాయక గణపతి అని ఈ వినాయకుడిని పిలుస్తారు. తమిళనాడులోని తిరునల్లార్శని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -