Himaja: వైరల్ అవుతున్న నటి హిమజ సంచలన వ్యాఖ్యలు!

Himaja: బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికి వారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అయిన హిమజ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఈమె పలు కీలక రోల్స్ చేస్తూ అలరించింది. హీరోయిన్ల పక్కన నటిస్తూ కాస్త గ్లామర్ పాత్రలు చేసింది. అలాగే బుల్లితెరపై కూడా పలు షోలలో మెరుస్తూ వస్తోంది.

 

సోషల్ మీడియాలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను హిమజ సంపాదించుకుందని చెప్పాలి. మొదట ఈమె సీరియల్స్ చేస్తూ తన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక ఈమె కెరీర్ మారిపోయింది. బిగ్ బాస్ షోలో హిమజ డిసిప్లేన్ కి మంచి మార్కులు పడ్డాయి. బిగ్ బాస్ హౌస్ లో హిమజ చేసిన అల్లరి కూడా ఎక్కువగానే ఉంది.

 

హిమజ మొదట కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యింది. బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తూ క్రేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హిమజ తాజాగా ఇన్ స్టా రీల్స్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతోంది.

 

ఇన్ స్టాగ్రామ్ ద్వారా హిమజ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది. ఒకవేళ పెళ్లయ్యాక భర్త మారిపోతే ఏం చేస్తారు అని అడగ్గా అందుకు ఆమె బదులిస్తూ 25 ఏళ్ళు పెంచిన నాన్ననే వదిలేస్తాం, మొగుడొక లెక్క అని తెలిపింది. ఈ వీడియో ఫన్నీగానే ఉన్నా ఆమె ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హిమజ రీల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -