Himaja: వైరల్ అవుతున్న నటి హిమజ షాకింగ్ కామెంట్స్!

Himaja: బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హిమజ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హిమజ తనకు కెరియర్ మొదట్లో జరిగినటువంటి అవమానాలు, బాడీ షేమింగ్ గురించి తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో చాలామంది తనని అవమానించారని తెలిపారు. ముఖ్యంగా ఎంతో మంది డైరెక్టర్లు తన రెండు కళ్ళు చాలా చిన్న సైజులో ఉన్నాయి అంటూ కామెంట్లు చేశారని అలాగే తన నడక కూడా మగరాయుడిలా ఉంటుందని బాడీ షేమింగ్ చేశారు అంటూ ఈమె వెల్లడించారు.

 

ఇలా తన గురించి డైరెక్టర్లు ఇలా మాట్లాడటంతో చాలా ఏడ్చానని తెలిపారు. అయితే మన గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్ ను మాత్రమే తీసుకొని నెగటివ్ ని వదిలి పెట్టాలని తెలుసుకున్నాను. అప్పటినుంచి తనలో మరింత కసి పెరిగిందని హిమజ తెలిపారు. ఇక నా కళ్ళకు మేకప్ వేసిన తర్వాత ఎవరైతే నా కళ్ళు బాలేవని చెప్పారో వాళ్లే తన కళ్ళును మెచ్చుకున్నారని ఈ సందర్భంగా హిమజా తెలిపారు.

 

ఇకపోతే తనకు సోషల్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అయితే ముందుగా ఆ సోషల్ వర్క్ అనేది మన ఇంట్లోనే ప్రారంభించాలని ఈమె తెలిపారు. అందుకే తన కార్ డ్రైవర్ ముగ్గురు ఆడపిల్లల బాధ్యత తానే తీసుకున్నానని తెలిపారు.ఇలా వీరి చదువుల బాధ్యత మొత్తం తానే తీసుకొని వారిని చదివిస్తున్నానని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -