Vishwak Sen: విశ్వక్ సేన్ కు ఇంత బలుపా.. పరువు పోయిందిగా?

Vishwak Sen: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు ఎల్లలుదాటి మరీ వ్యాపిస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. యంగ్ హీరోల్లో కొందరైతే వివాదాల ద్వారానే తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే ఆలోచనల్లో ఉంటున్నారు. ఇలాంటి ఆలోచన కలిగిన యంగ్ హీరోనే విశ్వక్ సేన్.

కెరీర్ లో హిట్ల కన్నా వివాదాలు ఎక్కువ కలిగిన ఈ యంగ్ హీరో.. అంతకంతకు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీ అని కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా ఒదిగి ఉండటం అనేది ఎంతో ముఖ్యం. కానీ ఈ యంగ్ హీరోకి మాత్రం అది అస్సలు తెలియదు. పొగరు, బలుపు అనే పదాలు విశ్వక్ సేన్ కు ఎంతో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంటాయి.

విశ్వక్ సేన్ వైఖరి వల్ల వేరే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రాకపోవడంతో తానే సొంతంగా సినిమాలు చేసుకునే స్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని అవకాశాలు వస్తుండగా.. వాటిని కూడా అతడు పాడు చేసుకుంటున్నాడు. తాజాగా 42 సంవత్సరాల వివాదాలు లేని కెరీర్ ను కలిగిన అర్జున్ తో ఓ సినిమా ఒప్పుకొని, చివరకు ఫోన్ ఎత్తకుండా వేధించిన విశ్వక్ సేన్ గురించి.. అర్జున్ మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తెలియజేశాడు.

విశ్వక్ సేన్ మంచి నటుడా కాదా అనేది పక్కన బెడితే.. ఇలా చేస్తే మాత్రం వేరే ఏ సినిమా అవకాశాలు రావు అనేది మాత్రం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాటలు. ఆర్టిస్ట్ కు పొగరు, బలుపు అనేవి ఉండకూడదని, సినిమాను సినిమా లాగా పవిత్రంగా భావించినప్పుడే ఇండస్ట్రీలో మనగలడని ఇండస్ట్రీ పెద్దలు సలహా ఇస్తున్నారు. మరి విశ్వక్ సేన్ కు ఈ దెబ్బతో సినిమా అవకాశాలు తగ్గుతాయో లేదంటే అవకాశాలకు ఎలాంటి గండిపడకుండా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts