WaltairVeerayya Review: సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య.. మూవీ ఎలా ఉందంటే?

WaltairVeerayya Review: సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలలో ఒకటైన వాల్తేరు వీరయ్యపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీఎంట్రీలో చిరంజీవి సినిమాలు బ్రేక్ ఈవెన్ కాకపోవడం వల్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కచ్చితంగా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వాల్తేరు వీరయ్య మూవీ కథ కొత్త కథ కాకపోయినా చిరంజీవి, రవితేజ యాక్టింగ్, కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్లు వాల్తేరు వీరయ్యకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు బాబీ చిరంజీవి పాత్రను ఊరమాస్ గా చూపించడం గమనార్హం. కథలోకి వెళితే వీరయ్య జాలారీపేట అనే ప్రాంతంలో అక్కడ నివశించే ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంటారు.

వీరయ్య తమ్ముడు విక్రమ్(రవితేజ) కమిషనర్ గా పని చేస్తుంటారు. సవతి తల్లి సోదరులు కావడంతో వీళ్లిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అయితే డ్రగ్ డీలర్ అయిన ప్రకాష్ రాజ్ వల్ల వీళ్ల జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? విక్రమ్ పాత్ర ఎందుకు చనిపోతుంది? శృతి హాసన్ రియల్ గా చేసే ఉద్యోగమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే వాల్తేరు వీరయ్య మూవీ అని చెప్పవచ్చు.

చిరంజీవి యాక్టింగ్, రవితేజ రోల్, సాంగ్స్, ప్రొడక్షన్ విలువలు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించగా రొటీన్ కథ, కథనం, కొన్ని సీన్లలో ల్యాగ్ మైనస్ అయింది. మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేలా ఈ సినిమా ఉండటం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

న్యూస్ బైట్ రేటింగ్ : 2.75/5.0

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -