Kadapa MP Candidate: కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్న జగన్.. షర్మిల కామెంట్లతో మనస్సు మారిందా?

Kadapa MP Candidate: వైయస్ కుటుంబానికి కడప కంచుకోట అనే సంగతి మనకు తెలిసిందే. కడపలో వైయస్సార్ కుటుంబాన్ని కాదని ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు అయితే ఈ ఎన్నికలలో మాత్రం వైసిపి కంచుకోటలు బీటలు బారుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనగా మారింది.

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్న సంగతి మనకు తెలిసిందే .గతంలో కూడా ఈయన ఇక్కడ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డికి జగన్ అప్పగించారు కానీ అవినాష్ రెడ్డికి పోటీగా వైఎస్ఆర్ షర్మిల రంగంలోకి దిగారు.

వైయస్ అవినాష్ రెడ్డి వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితులకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి తరుణంలో బాబాయ్ చంపిన హంతకుడు కావాలా న్యాయం కోసం పోరాడే మేము కావాలా అంటూ షర్మిల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇలా కడప ఎంపీ విషయంలో పలు వ్యతిరేకతలు కూడా వస్తున్నటువంటి తరుణంలో జగన్ తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నామినేషన్స్ తేదీ దగ్గర పడుతున్నటువంటి సమయంలో కడప ఎంపీ అభ్యర్థిని మార్చబోతున్నారు అంట వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డికి కడప ఎంపీ స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. మరి కడప ఎంపీ అభ్యర్థి విషయంలో వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -