YSRCP Candidates: ఆ స్థానాలలో మార్పులు చేయబోతున్న వైసీపీ.. గెలవడం కోసం ఏకంగా ఇన్ని ఇబ్బందులా?

YSRCP Candidates: ఏపీలో ఇటీవల వస్తున్న సర్వేలు వైసీపీని ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. ఎటూ తోచని పరిస్థితులకు నెట్టివేస్తున్నాయి. ఓటమి ఖాయం అనుకునే పరిస్తితులను వైసీపీ అధిష్టానంలోనే క్రియేట్ చేస్తున్నాయి. మూడు నెలల క్రితం వచ్చిన సర్వేల్లో టీడీపీ, జనసేన కూటమి 100కి పైగా స్థానాలతో అధికారంలోకి వస్తాయని తెలిపాయి. కానీ, ఇప్పుడు ఆ నెంబర్ పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల బట్టి ఈ నెంబర్ 140కి దాటింది. అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైసీపీకి ప్రతిపక్షహోదా కూడా కష్టమే అనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జగన్ అప్రమత్తం అయ్యారు. పక్కాగా ఓడిపోతామని తెలిసిన దగ్గర అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థిని మార్చి వ్యతిరేకత తగ్గించుకుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అభ్యర్థిని మార్చడం వలన చాలా నియోజకవర్గాల్లో ప్రభావం పడే అవకాశం ఉన్న దగ్గర జగన్ ఫోకస్ చేశారు.

అన్నింటికంటే ముందు కడప ఎంపీ స్థానంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి వైసీపీ తరుఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ నుంచి అవినాష్ రెడ్డిని మార్చి కొత్త వ్యక్తిని పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కడప నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తన ప్రధాన అస్త్రంగా వివేకాహత్య కేసును వాడుకుంటున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా వివేకాహత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డి ఉన్నారు. షర్మిల చాలా బలంగా వివేకాహత్య కేసును ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. వివేకాహత్య కేసులోని నిందితులకు, బాధితలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఎవరి వైపు ఉంటారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వివేకాహత్య కేసును బలంగా వాడుకోవడానికి టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. కానీ.. సునీతను పక్కన పెట్టుకొని షర్మిల అవినాష్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు.. అవినాష్ నిందితుడు అయితే.. ఆ నిందితుడిని జగన్ కాపాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మొదట్లో వైసీపీ షర్మిలన టార్గెట్ చేసింది. కానీ, ఇప్పుడు సైలంట్ అయింది. అలా సైలంట్ అయితే.. వివేకాహత్య కేసు డైవర్ట్ అవుతుందని జగన్ భావించారు. కానీ, షర్మిల మాత్రం వివేకాహత్య కేసు అంశం ప్రచారంలో ఉండేలా వ్యూహాత్మంగా విమర్శిస్తున్నారు. ఏపీలో రాజధాని వంటి అంశాలు కూడా పక్కకు వెళ్లి కేవలం వివేకాహత్య కేసే ఎన్నికల అస్త్రంగా మార్చేశారు.

కాబట్టి కడప నుంచి అవినాష్ రెడ్డి ఉంటే ఓటమి తప్పదని జగన్ భావించినట్టు తెలుస్తోంది. ఓటమి మాత్రమే కాదు.. ఆయన మూడో స్థానానికి పరిమితం అవుతాడని భయపడుతున్నారు. అదే జరిగితే కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పులివెందులపై ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ కూడా పోతే.. ఏకంగా జగన్ తన పార్టీనే మూసుకోవాల్సి వస్తుంది. అందుకే.. అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

దీంతో పాటు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభ్యర్థును మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మైలవరంలో తిరుపతి రావు స్థానంలో జోగి రమేష్‌ను దించాలని ఆలోచిస్తోంది. ఇక విజయవాడ వెస్ట్‌ను పోతిన మహేష్‌తో భర్తీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -