YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభకు రాలేదని కుప్పం ప్రజలపై వైసీపీ నాయకులు గుండాయిజం చేస్తూ నీటి కొళాయిలను తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్ గ్రామస్తుల కథనం మేరకు ఇక్కడ ఉండే అంగన్వాడి కేంద్రం ఎదురుగా స్థానిక బోరు పంపుకు ఒక కులాయి వేసుకొని అంగన్వాడి కేంద్రంతో పాటు చుట్టూ ఉన్నటువంటి 10 కుటుంబాలు బిందెలతో ఇక్కడి నుంచి నీటిని తమ అవసరాలకు తీసుకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే సీఎం నిర్వహించిన సభకు రావాలని అంగన్వాడీ ఉద్యోగస్తులతో పాటు చుట్టుపక్కల వారికి కూడా వైకాపా నేతలు సమాచారం ఇచ్చారు.

ఈ విధంగా కుప్పంలో జరిగినటువంటి సీఎం సభకు రాకపోవడంతో ఆగ్రహించిన వైకాపా నేతలు ఆ బోరుకు సంబంధించిన వ్యక్తికి చెప్పి ఆ కులాయిని తీసేయించారు. దీంతో అంగన్వాడి కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి వారు కూడా తీవ్రమైనటువంటి నీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక ఈ విషయంపై ప్రశ్నించడంతో స్థానిక వైకాపా నాయకులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా నీటిని వృధా చేయడం దేనికని నీటి వృధాని అరికట్టడం కోసమే కులాయి తీసేసామని చెబుతున్నారు. సొంతంగా వాళ్లు సామాగ్రి తెచ్చుకుంటే తిరిగి నీటి కొళాయి బిగిస్తామంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ విధంగా వైసిపి నాయకులు ప్రజలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని చూస్తుంటే వారి గొయ్యిలో వారే పడబోతున్నారని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -