Uttar Pradesh: చదివింది గొప్పగొప్ప చదువులు.. చేసే పనులు మాత్రం అవి?

Uttar Pradesh: ఇటీవల కాలంలో చాలామంది యువత తప్పు మార్గంలో నడుస్తున్నారు. తప్పుగా ఆలోచిస్తూ చదివిన చదువును పక్కన పెట్టి లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. చాలామంది కేటుగాళ్లు అమాయకమైన వారిని అందమైన అమ్మాయిలను ఎరవేసి డబ్బులు లాగి వారిని చంపడం మోసాలకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. అమ్మాయిలు కూడా తొందరగా అలాంటి కేటుగాల మాయలో పడి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఒక కేటుగాడు అందమైన బాగా పలుకుబడి ఉన్న యువతులకు ఎర వేసి దారుణాలకు పాల్పడుతున్నాడు.

 

చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్‌, ముజఫర్‌నగర్‌ కు చెందిన విశాల్ అనే 26 ఏళ్ళ వ్యక్తి ఒక ఉన్నత విద్యావంతుడు. బీసీఏ, ఎంబీఏ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివి గుర్గావ్‌లోని ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు లక్షల్లో డబ్బు సంపాదించాలి అన్న ఆశతో ఆ ఉద్యోగం మానేసి సొంతంగా ఒక రెస్టారెంట్‌ ని ప్రారంభించాడు. కానీ వ్యాపారం సరిగా నడవలేదు. లక్షల్లో నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అమ్మాయిలను బురిడీ కొట్టించే అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. దాంతో అనుకున్నది ఆలస్యం బాగా డబ్బున్నా బ్యాచిలర్‌లా నటిస్తూ పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.

అందుకు మ్యాట్రిమోనీ సైట్లను అవకాశంగా మలుచుకున్నాడు. ఇతని ప్రోఫైల్ చూసి ఎవరైనా కాంటాక్ట్‌ అయ్యారా వారు బలి అవ్వాల్సిందే అని చెప్పవచ్చు. అలా అతని ప్రొఫైల్ చూసి కాంటాక్ట్ అయిన వారికి అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, బంగ్లాలు చూపిస్తూ ధనవంతుడిలా బిల్డప్‌ ఇచ్చేవాడు. ఆపై మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర నుంచి లక్షల్లో డబ్బు గుంజేవాడు. అనంతరం నెంబర్ మార్చేసి మరో వేటకు సిద్ధమయ్యేవాడు. అలా ఇప్పటికీ ఎంతమంది యువతలను మోసం చేశారు. అచ్చం ఇలాగే గుర్గావ్‌కు చెందిన ఒక యువతి, మ్యాట్రిమోనీలో అతని ప్రోఫైల్‌ చూసి మనసు పారేసుకుంది.

అతగాడు ఇచ్చిన బిల్డప్ కు యువతి కుటుంబసభ్యులు అందరూ ఇతడే మా అల్లుడు అనడం మొదలు పెట్టేశారు. ఇదే అదను అనుకున్న సదరు యువకుడు యువతి, ఆమె స్నేహితులకు విదేశాల నుంచి ఖరీదైన ఫోన్‌లు, ఇతర వస్తువులు తక్కువ ధరకే తెప్పిస్తానని చెప్పి డబ్బులు ఇప్పించుకున్నాడు. అలా మొత్తం గా ఆ యువతి నుంచి రూ.3.05 లక్షలను కాజేశాడు. ఆ తర్వాత యువతి వస్తువుల గురించి అడగడంతో మొహం చాటేశాడు. కొన్నాళ్లకు ఆమె నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టేశాడు. దాంతో మోసపోయినట్లు గ్రహించిన సదరు యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేటుగాడి విశ్వరూపం బయటపడింది. పోలీసులు కూడా ఆ కేటు గాడిని ఈజీగా పట్టుకోలేదు. ఒక మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్‌ ఆపరేషన్‌ చేయించి నిందితుడిని పట్టుకున్నారు. ఆమె ద్వారా ఒక ఏరియాకు రప్పించి అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -