Reporters: జుట్లు పట్టుకుని కొట్టుకున్న ప్రముఖ ఛానళ్ల రిపోర్టర్లు.. ఏం జరిగిందంటే?

Reporters: ఆంధ్రప్రదేశ్ లో సీఎంవో లో ఇద్దరు మహిళా జర్నలిస్టులు చాలా కాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరు టీవీ9 రిపోర్టర్ కాగా మరొకరు ఎన్టీవీ రిపోర్టర్. రెండు చానళ్ల అనధికారిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కావడంతో ఆయన వద్ద ప్రాపకం కోసం వీరు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావని చెప్పవచ్చు. ఏదైనా ఇష్యూ జరగగానే వీరిద్దరి మైకులు ఆయన నోటి ముందు ఉంటాయి. అయితే ఇటీవల ఇద్దరూ సజ్జల ప్రాపకం తమ కంటే తమకు ఎక్కువ కావాలని పోటీ పడటం ప్రారంభించారు.

 

ఈ క్రమంలోనే ఆధిపత్య పోరాటం చివరికి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. సీఎంవో దగ్గర వీరికే కేటాయించిన ఒక కంటెయినల్ బాక్స్ లో జుట్లు పట్టేసుకుని కొట్టుకొని, తిట్టుకున్నారు. మధ్యలో సజ్జల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. ఇలా కొట్టుకుని ఊరుకుంటే గాసిప్స్ లాగే ఉండిపోయేవేమో కానీ వారే వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. గబ్బు గబ్బు కావడంతో ఆ రెండు చానళ్లు యాజమాన్యాలు అక్కడ్నుంచి బదిలీ చేసినట్లుగా ప్రకటించాయి. అయితే ఆ ఇద్దరూ తక్కువోళ్లేమీ కాదు.

తలచుకుంటే వారం పది రోజుల్లో మళ్లీ సీఎంవోలోకి వస్తారనే గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. హసీనాకు టీవీ9లో ఉన్న పలుకుబడి కంటే సజ్జల దగ్గర సీఎం జగన్ సీపీఆర్వో శ్రీహరి వద్ద ఉండే పలుకుబడి చాలా ఎక్కువ. వారు తల్చుకుంటే టీవీ9 యాజమాన్యం పది రోజుల్లో హసీనాను మళ్లీని సీఎంవోకు పంపుతుంది. హసీనా కూడా తక్కువేమీ కాదు అందుకే ఇద్దరూ సీఎంవోలోకి ఓ రోజు అటూఇటూగా మళ్లీ వస్తారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -