Lakshmi Parvathi: అజ్ఞాతంలోకి కొడాలి నాని, లక్ష్మిపార్వతి.. ఆ దుమారంపై స్పందించరా?

Lakshmi Parvathi: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి అజ్ఞాతంలోకి వెళ్లారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లుకు ఏపీ వైసీపీ ప్రభుత్వం ఆమోదించడంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకతీతంగా ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యరేకిస్తున్నారు. వైసీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు చెప్పకపోయినా.. ఆఫ్ ది రికార్డుగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ఆ యూనివర్సిటీ పేరును మార్చడం సరికాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ జగన్ నిర్ణయం తీసుకునే వరకు తమకు కూడా తెలియదని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీజేపీతో పాటు జనసేన కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ఏపీ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. అభివృద్ధి చేయడం చేతకాది కాదని, పేర్లు మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరును మార్చడం దుర్మార్గమని ఏపీ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పేరు మార్చడం సరికాదని, దీనిని పార్టీలకతీతంగా అందరూ వ్యతిరేకించాలని పవన్ కోరారు. ఇక టీడీపీ నేతలు ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళనలు చేస్తున్నారు. మళ్లీ ఎన్టీఆర్ పేరును పెట్టే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహకరించుకోవాలని, ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా దీనిని వ్యతిరేకించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పదవికి ఆయన రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఈ బిల్లును తీసుకువచ్చింది. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అల్లుు శరత్ చంద్రారెడ్డి ఇరుకున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని దాని నుంచి డైవర్ట్ చేసేందుకు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని కొంతమంది అబిప్రాయపడుతున్నారు.

అయితే దీనిపై ఇప్పటివరకు వైసీపీ పార్టీలో ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎన్టీఆర్ తనకు దేవుడితో సమానమని చెప్పుకునే మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా దీనిపై స్పందించకపోవడం విశేషంగా మారింది. వైసీపీలో ఉన్న వీరిద్దరు ఎందుకు స్పందిచలేదనేది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు సమాధానం చెప్పుకోలేక ఏమైనా అజ్ఞాతంలోకి వెళ్లారా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని రోజూ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ మీడియాలో ఉంటారు. అలాంటి కొడాలి నాని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఇంత దుమారం జరుగుతున్నా ఎందుకు స్పందిచడం లేదని కొంతమంది ప్రశ్ని్తున్నారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతి కడా ఇప్పటివరకు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -