Raghuramakrishnan Raju: వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు పోటీ ఎక్కడ నుంచి?

Raghuramakrishnan Raju: నర్సాపురం రెబల్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గర్తింపును చాటుకున్నారు. వైసీపీ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా ఆయన తయారు అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై ఆయన రోజూ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే సాహసం జగన్ చేయడం లేదు. రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వైసీపీకి ఒక్క ఎంపీ దూరమవుతారని, అందుకే జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని తెలుస్తోంది.

కానీ టెక్నికల్ గా చూస్తే ఆయనను సస్పెండ్ చేయలేదు కనుక వైసీపీలోనే ఉన్నట్లు లెక్క. కానీ రఘురామ మాత్రం జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హీట్ పుట్టిస్తూనే ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు బీజేపీ మద్దతుదారుడు అని కొందరు, కాదు చంద్రబాబు మనిషి అంటూ మరికొందరు చెబుతూ ఉంటారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక గతంలో ఆయన టీడీపీలో ఉండటంతో.. ఆ పార్టీ నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబును రఘురామకృష్ణంరాజు విమర్శించిన సందర్భాలు పెద్దగా లేవు.

అంతేకాకుండా టీడీపీ అనుకూల ఛానెల్స్ రఘురామకృష్ణంరాజుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్లను లైవ్ పెడుతున్నాయి. అంతేకాకుండా ఆయనతో డిబేట్లు చేస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు అనుకూలంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారరే చర్చ ఉంది. అయితే జగన్ ప్రభుత్వంపై విమర్శలు అటు ఉంచితే.. వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. నర్సాపురంలో ప్రస్తుతం జనసేన బలంగా ఉంది. దీంతో ఆయన జనసేనలో చేరతారని, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు నర్సాపురం జనసేన ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ఇప్పటికే నాగబాబు ప్రకటించారు. దీంతో నర్సాపురం జనసేన టికెట్ ఖాళీగానే ఉంది. కానీ రఘురామకు టికెట్ ఇవ్వడంటూ జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతునన్నారు. ఆయన ఒక పార్టీలో స్ధిరంగా ఉండలనే అంశాన్ని తీసుకొస్తున్నారు. దీంతో జనసేన టికెట్ వస్తుందా లేదా అనేది ఇఫ్పుడే చెప్పలేం.

ఇక టీడీపీ నుంచి టికెట్ వస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటే ఆ టికెట్ బీజేపీకి వెళ్లడం ఖాయం. అదే జరిగితే నర్సాపురం నుంచి హీరో ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ కు బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే ప్రభోద్ కు బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రఘురామకృష్ణంరాజుకు టికెట్ దక్కడం కష్టమే. దీంతో వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -