Avinash: అవినాష్ పై ఇంత పగేంటి.. సునీత చుక్కలు చూపిస్తోందిగా!

Avinash: వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అవినాష్ రెడ్డి పేరు వసంతులనంగా మారింది. కాగా వివేక హత్య కేసు విషయంలో సీబీఐ విచారణకంటే, ఎక్కువగా కోర్టుల్లోనే విచారణ జరుగుతున్నట్టుంది. ముందస్తు అరెస్ట్ లు వద్దంటూ కొందరు, బెయిల్ కోసం కొందరు, ఆ బెయిల్ వద్దంటూ ప్రత్యర్థి వర్గం, అసలు సీబీఐ విచారణ అధికారుల్ని మార్చేయాలంటూ నిందితుల బంధువులు ఇలా తెలంగాణ హైకోర్ట్, సుప్రీంకోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్లు దాఖలాలు కావడంతో విచారణలు కూడా జరుగుతున్నాయి.

తాజాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వివేకా సునీతా రెడ్డి సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై రేపు విచారణ జరుగనుంది. ఇటీవల సీబీఐ విచారణ, భాస్కర్ రెడ్డి అరెస్ట్, ఆయన తనయుడు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ల వ్యవహారం మూడు రోజులపాటు ఉత్కంఠకు కారణమైన విషయం తెలిసిందే. చివరకు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు లను ఇచ్చింది. ఈనెల 25 వరకు ఆయను విచారణకు పిలవొచ్చు కానీ, అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకి ఇప్పటికే ఆదేశాలలో జారీ చేసిన విషయం తెలిసిందే.

 

దాంతో గత రెండు రోజులుగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఈనెల 25న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈలోగా సునీతా రెడ్డి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీం కోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త మరింత హాట్ టాపిక్ గా మారింది. సునీతా రెడ్డి టీడీపీతో కుమ్మక్కయ్యారని, వివేకా హత్య వెనక ఆమె, ఆమె భర్త కూడా ఉన్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఎప్పుడూ సునీతా రెడ్డి నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఈ వ్యవహారంలో ఆమె పట్టుదలగా ఉన్నట్టు తేలిపోయింది. అవినాష్ రెడ్డికి సునీత చుక్కలు చూపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -