Sunitha: సునీతకు ప్రాణహాని తలపెట్టింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?

Sunitha: ప్రతీ అక్కాచెల్లమ్మకు జీవితాంతం తోడుగా ఉంటా.. వారికి కన్నీటిని తుడుస్తా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఆడపిల్ల కూడా నా అక్కచెల్లమ్మే. ఇవి జగన్ ప్రతీ బహిరంగ సభలో చేసే కామెంట్స్. ఊరులో ఉన్న అక్కా చెల్లమ్మల సంగతి దేవుడెరుగు కానీ.. జగన్ ఇంట్లోని చెల్లమ్మలకే రక్షణ లేకుండా పోయింది. అది కూడా జగన్ వలనే రక్షణ కరువైంది. ఈ మాట చెబుతున్నది టీడీపీ, జనసేన నేతలు కాదు. స్వయానా జగన్ చెల్లలు వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి. అవును తనకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది కాపాడండని హైద్రాబాద్ పోలీసులను రక్షణ కోరింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఎక్కడైనా ఉంటుందా? భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు.. దేశంలోని ఉన్న ఆడవారంతా నా సోదరిలే అని జగన్ చెప్పిన మాటలకు ప్రజల చెవులకు చిల్లులు పడుతున్నాయి. కానీ.. సొంత చెల్లెలు అన్న మీద పోలీస్ ఫిర్యాదు చేసిందంటే.. ఈ అన్న కథలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. జగన్ మనుషులు తనను చంపాలని చూస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని సునీత హైద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సోదరి షర్మిలను చంపేస్తామంటున్నారని.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. శత్రుశేషం లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని.. తమకు ఆదుకోవాలని ఏడుస్తున్నారు. ఇది.. సొంత చెల్లెలకు జగన్ అన్నయ్య ఇచ్చిన బహుమతి.

 

దీంతో.. జగన్ పైన, వైసీపీ పైనా సోషల్ మీడియాలోనే కాదు సొసైటీలో కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎవరు ప్రభుత్వానికి, జగన్ కు ఎదురు తిరిగితే వాళ్లని చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ మాట్లాడితే మూడు పెళ్లాలు, ముగ్గురు పెళ్లాలు అంటారు. చంద్రబాబు, లోకేష్ మాట్లాడితే.. వారి కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడుతారు. షర్మిల విమర్శిస్తే.. అసలు ఆమెకు వైఎస్ కుటుంబంతో సంబంధంకాదని అంటారు. సునీత తండ్రి హత్యకేసులో న్యాయం కోరితే.. శత్రుశేషం లేకుండా చేస్తామని అంటారు. అసలు ఎవరు శత్రువులు? ఎవరు కావాల్సిన వారు? వివేకానంద రెడ్డి లేకుండా పార్టీ బలపడిందా? షర్మిల లేకుండా 2014లో పార్టీ నిలబడిందా? అదే షర్మిల లేకుండా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా? జగన్ రాజకీయంగా ఎదగడానికి సునీత సాయం తీసుకోలేదా? అప్పడు వీరంతా కావాల్సిన వారు.. ఇప్పుడు శత్రువులు అయ్యారా? రాజకీయాల కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా? సొంతవారినే శత్రువులుగా మార్చుకోవాలా? రాజకీయాల్లో ఎదగడం కోసం చెల్లెలుది వైఎస్ రక్తం కాదు అని అనేస్తారా? ఈ ప్రశ్నలన్ని సోషల్ మీడియాలో.. సమాజంలో జగన్ అండ్ కో వైఖరిపై వినిపిస్తున్న ప్రశ్నలు.

 

కాలకేయ సైన్యంలా వెంటాడుతున్నారు. వేధిస్తున్నారని సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. షర్మిల ఇలాంటి ఫిర్యాదులు చేశారంటే..ఆమె వేరే పార్టీలో ఉన్నారు కనుక.. అదో రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. ఏ పార్టీతోనూ సంబంధంలేని సునీత ఇలాంటి పోలీసులకు ఫిర్యాదు చేశారంటే.. ఆమె విమర్శల్లో ఎంతోకొంత నిజం లేకుండా ఉంటుందా? ఈ మాత్రం లాజిక్ జగన్ ఆలోచించకపోయినా.. జనం ఆలోచించకుండా ఉంటారా?

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -