Chandrababu Naidu: జగన్ ను కాపీ కొట్టి అమలు చేసే పథకాల వల్ల లాభం ఉంటుందా?

Chandrababu Naidu: మహానాడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టో తొలి విడతను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన పొందుపరిచిన సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతున్నాయి.ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారు అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇలా నవరత్నాలను కాపీ కొట్టడం తప్ప చంద్రబాబు నాయుడు, అతని నేతలకు కొత్త సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకురావాలని ఆలోచన ఏమాత్రం లేదని తాజాగా ఈ మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం జగన్ అమ్మబడి పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇదే పథకాన్ని తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు నాయుడు తల్లుల ఖాతాలో డబ్బులు వేయబోతున్నారు.ఇక జగన్ ఇంట్లో ఒక్కరికే వేగా చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

 

ఇక వైయస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఏడాదికి 18,000 చొప్పున జగన్ సర్కార్ అందిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇదే పథకాన్ని ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 సంవత్సరాల వారందరికీ ఏడాదికి 18000 రూపాయలు చొప్పున జమ చేయనున్నారు.ఇక రైతు భరోసా పథకాన్ని కూడా చంద్రబాబునాయుడు కాపీ కొట్టారని తెలుస్తుంది. ఈ పథకం కింద 20 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

 

ఇలా జగన్ నవరత్నాలలో భాగంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే ఇందులో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికిఅందుతుండడంతో చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేసిన పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తుంది. అంతేకాకుండా నవరత్నాల విడుదల చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను చూసి ఒకప్పుడు విమర్శించిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు అవే సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకురావడంతో పరోక్షంగా వైసిపి అందిస్తున్న సంక్షేమ పథకాలు భేషుగా ఉన్నాయి అంటూ టిడిపి స్టాంప్ వేసిందని తెలుస్తోంది.
.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -