YSRCP: వైసీపీ రాజీనామాల నాటకం.. కేసీఆర్ వ్యూహంతో ముందుకు వెళ్లలేరా?

YSRCP: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కాక రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఈ అంశం వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. మూడు రాజధానుల కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నాయి. మంత్రులతో సహా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసేందుకు సిద్దమంటూ ప్రకటనలు చేస్తున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే ఏకంగా రాజీనామా చేసేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్ లో ఆ రాజీనామా లేదు. దీంతో రాజీనామా పేరుతో డ్రామా ఆడారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా తాము రాజీనామాకు సిద్దమని, రాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దమాంటూ వైసీపీ సవాల్ చేస్తోంది.

టీడీపీని ఇరునుక పెట్టేందుకు ఒక వ్యూహం ప్రకారమే వైసీపీ రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తంోది. రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు మైలేజ్ రాకుండా., రాజధాని అమరావతి అంశం హైలెట్ కాకుండా కేవలం మూడు రాజధానుల అంశం చుట్టే రాజకీయాలు నడిచేలా వైసీపీ చేస్తోందని తెలుస్తోంది. రాజీనామాలు చేస్తామని చెప్పినా.. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. దీంతో రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందని, నాటకాలు స్టార్ట్ చశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అమలు చేసిన ఒక వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజీనామాలు అనగానే తెలంగాణ అందరికీ గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజీనామాల వ్యూహన్ని కేసీఆర్ అమలు చేశారు. తెలంగాణ మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం మళ్లీ గెలవడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజీనామల అంశం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. ప్రతిసారి రాజీనామాలు చేయడం, మళ్లీ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ద్వారా తెలంగాణ ఉద్యమం బలం ఏంటో పార్టీలకు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు ముఖ్యపాత్ర పోషించాయి. కేంద్రం తొలొగ్గి తెలంగాణ ఇవ్వడానికి ఈ వ్యూహం బాగా ఉపయోగపింది.

ఇప్పుడు మూడు రాజధానులుగా మద్దతుగా రాజీనామాలు చేస్తామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యులు ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమవుతునన్నాయి. మూడు రాజధాలను అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తే ఎందుకు రాజీనామా చేయడం లేదనే ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయి. మూడు రాజధానులపై జనం మూడ్ ను తెలుసుకోడానికి వైసీపీ నేతలు రాజీనామా చేస్తామని ప్రకటనలు చేస్తున్నా.. ఒక్కరూ కూడా రాజీనామా చేయలేదు. రాజీనామా చేసి ఆమోదించుకుని ఎన్నికలకు ఎందుకు సద్దం కావడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కావాలనే ఒక వ్యూహంలో భాగంగానే రాజీనామాల అంశాన్ని తెురపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -