YCP Leaders Attack On Photographer: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మూకల దాడి.. వైసీపీ నేతల తీరు ఎప్పటికీ మారదా?

YCP Leaders Attack On Photographer: ఓటమి భయం వైసిపి నేతలను కార్యకర్తలను వెంటాడుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున గుండాయిజం రౌడీయిజం చేస్తూ అందరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులపై వైసిపి కార్యకర్తలు దాడి చేస్తున్నటువంటి ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఈనెల 18వ తేదీ అనంతపురం రాప్తాడులో జరిగిన సిద్ధం భారీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన మరవకముందే మరోసారి ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది.

అనంతపురం భారీ బహిరంగ సభలో శ్రీకృష్ణపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కర్రలతో దాడి చేశారు .దీంతో ఈయన ఏకంగా ఒల్లంత గాయాలు పాలై హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన మరవక ముందే మరో విలేకరిపై దాడి జరిగింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ఈ సభా ప్రాంగణం వద్దకు వెళ్లగానే వైసిపి కార్యకర్తలు అతనిపై దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి దాడులు జరుగుతాయని ముందుగానే గ్రహించినటువంటి శివకుమార్ అక్కడి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించారు. అయితే బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా అధికారపక్షం వైపు మాట్లాడటం గమనార్హం. పోలీసుల ముందే వైసిపి కార్యకర్తలు తమ కెమెరా లాక్కొని ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -