YCP Leaders: దొరికినంత దండుకుని వెళ్లిపోదామనుకుంటున్న వైసీపీ నేతలు.. మొత్తం ఊడ్చేసుకుంటున్నారా?

YCP Leaders: వైసీపీకి గెలుపుపై నమ్మకం పోయినట్టు కనిపిస్తోంది. అందుకే.. ఎన్నికల ముందు దొరికిన కాడికి దోచుకుందామని అనుకుంటున్నట్టు ఉన్నారు. పథకాలను కూడా పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. చిన్న చిన్న పనులను పక్కన పెట్టి… ప్రభుత్వంలో కీలక నేతలకు చెందిన కాంట్రాక్టర్లకు పెండింగ్ లేకుండా అన్ని క్లియర్ చేస్తున్నారు. వేలకోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ నెల ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చి మరీ పెద్ద ఎత్తున చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. బడాబాబులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయిలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ రాకముందు పెద్ద ఎత్తున చెల్లింపులు జరిగాయి. కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈసీ నిబంధనలు అడ్డురాకుండా.. అభివృద్ది పూర్తి పనులకు బిల్లులు క్లియర్ చేస్తున్నామని చెబుతున్నారు.

పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నారు కానీ.. ఇటీవల బటన్ నొక్కిన పథకాలకు మాత్రం డబ్బు వేయడ లేదు. ఆర్బీఐ దగ్గర తీసుకున్న డబ్బు పథకాలకు సరిపడి ఉండేవి. కానీ, ఎలాగూ ఓడిపోతాం కనుక.. పథకాలకు చెల్లించినా ప్రయోజనం లేదని అనుకుంటున్నారట. దీంతో.. సన్నిహితులు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు క్రియర్ చేస్తే.. తర్వాత వచ్చే ప్రభుత్వంలో వారికి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారు. దానికి తోడు కాంట్రాక్టర్లకు పెండింగులు క్లియర్ చేస్తే.. తమకు కమీషన్లు కూడా వస్తాయని అభిప్రాయ పడుతున్నారు. ఆ కమీషన్లతో ఎన్నికల ఖర్చు కూడా దాటిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

అందుకే బటన్ నొక్కిన పథకాలకు డబ్బుల ఇవాళ పడతాయి… రేపు పడతాయని నెట్టుకుంటూ వస్తున్నారు. కాంట్రాక్టు బిల్లులు మాత్రమే కాదు.. కొన్ని విషయాల్లో తాము చట్టపరంగా ఇరుక్కోకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాలంటీర్ల ప్రతీ ఏడాది అరవై కోట్లు ఖర్చు అవుతుంది. దానికి సంబంధించిన కాంట్రాక్టు FAO అనే సంస్థకు ఇచ్చారు. ఈ ఏడాది ఆ కాంట్రాక్టు కూడా పొడింగచలేదు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సేకరించిన డేటా ఈ కంపెనీ దగ్గరే ఉంది. వాలంటీర్లకు పని ఇచ్చేది కూడా ఈ కంపెనీయే. ఆ కంపెనీకు ఈ ఏడాదితో కాంట్రాక్టు అయిపోయింది. వచ్చే ఏడాదికి దాన్ని పొడిగించలేదు. మరోవైపు విద్యా కానుక లాంటి కాంట్రాక్టులను కూడా క్లియర్ చేస్తున్నారు. దీంతోపాటు.. భూములు కావాల్సిన వారు దరఖాస్తులు పెట్టుకుంటే గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేస్తున్నారు. వైసీపీ నేతల తీరు చూస్తూ గెలుపు మీద పూర్తిగా నమ్మకం సన్నగిల్లినట్టు ఉంది. అందుకే.. ఇప్పుడు దొరికికాడికి దోచుకుందామని ప్లాన్ వేశారు. సచివాలయంలో ఉన్నతాధికారుల వ్యవహారం కూడా అలాగే ఉందని చిన్న స్థాయి ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -