Puri: పూరి జగన్నాథ్ ఇచ్చిన బూతు సలహా వింటే షాకవ్వాల్సిందే!

Puri:తెలుగు రాష్ట్రాల ప్రజలకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎక్కడ కోల్పోయారో.. అక్కడే సంపాదించుకునే కెపాసిటీ ఉన్న డైరెక్టర్. ఇండస్ట్రీకి అనేక ఇండస్ట్రీ హిట్స్ అందించిన పూరి.. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. నాలుగు బూతు మాటలు మాట్లాడటం.. సినిమాల ఫ్లాపులు అన్నట్లు కెరీర్ ముందుకు సాగిపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి.. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ కొట్టడానికి కూడా తెగ అల్లాడిపోతున్నాడు. దానికి ప్రధాన కారణం.. ఇండస్ట్రీలో యువ డైరెక్టర్లు రావడంతోపాటు పూరి తీసే సినిమాలు నచ్చకపోవడమే. ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘లైగర్’ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో మరింతగా పూరి కెరీర్ పూర్తిగా పాతాళానికి పడిపోయింది.

 

 

సినిమాల విషయం పక్కన పెడితే.. పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎల్లప్పుడూ తన అభిమానులకు సందేశాలు, సలహాలు ఇస్తుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ.. ‘మీరు ఓ అమ్మాయిని లేదా అబ్బాయిని నిజంగా ప్రేమించుకుంటున్నారా? మీ ప్రేమలో నిజాయితీ ఉందంటే ఇలా తెలుసుకోండి. ఎవరైనా ప్రేమించుకునేటప్పుడు.. నువ్వు లేకుండా నేను ఉండలేను.. నేను లేకుండా నువ్వు ఉండలేవు. అనే డైలాగులు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాగే హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. నిజంగా మీరు ప్రేమించి ఉంటే.. పెళ్లికి ముందే రెండు, మూడు సార్లు మిమ్మల్నీ మీరు సంతృప్తి పరుచుకోండి. ఆ తర్వాత కూడా మీకు అలాంటి ఫీలింగ్ కలిగితే.. ఇద్దరూ హ్యాపీగా ఉంటామని అనిపిస్తే.. అప్పుడే పెళ్లి చేసుకోండి. ఒక వేళ శారీరకంగా కలిసిన తర్వాత వారి మీద ఫీలింగ్ రాకపోతే.. అది అట్రాక్షన్ అవుతుంది. అప్పుడు కలిసి ఉండలేరు. లైఫ్ మొత్తం కష్టాలు పడాల్సి ఉంటుంది.’ అని దారుణమైన కామెంట్లు చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆయన కామెంట్లకు మండిపడుతున్నారు. మరికొందరు తప్పేముందని, నిజమే చెప్పారన్నట్లు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -