Puri Jagannadh: పూరీ జగన్నాథ్ పరువు పోయిందిగా.. అలా అవమానిస్తూ?

Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఊహించిన అంచనాలను చేరుకోలేక డిజాస్టర్ ఎదుర్కొంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇలా ప్రమోషన్స్ భారీగా చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా పై నమ్మకంతో భారీ స్థాయిలో సినిమాని కొనుగోలు చేశారు. అయితే మొదటి రోజు సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారని చెప్పాలి. అయితే ఈ విషయంపై గతంలో పూరి జగన్నాథను ప్రశ్నించడంతో ఆయన బాధితులకు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.అయితే ఇప్పటివరకు వారికి సహాయం అందలేదని డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా రోడ్డు ఎక్కి ధర్నా చేపట్టారు.

 

తాజాగా లైగర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫిలింఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. పూరి జగన్నాధ్ తమకు 9 కోట్ల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాము 80 మంది ఉన్నామని 9 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు మాకు పూరి జగన్నాథ్ నుంచి చార్మి నుంచి విజయ్ దేవరకొండ నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందలేదని వారిపై మాకు ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు లేవని వెల్లడించారు.

 

ఈ సినిమా తీసుకొని భారీగా నష్టపోయామని చివరికి థియేటర్ కి కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితులలో ఉన్నామని తెలిపారు. ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సినిమా విషయంలో మమ్మల్ని ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మరి ఈ విషయంపై పూరి జగన్నాథ్ రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -