Kurnool: ప్రేమించిన యువతి కోసం అలాంటి పని చేసిన వ్యక్తి?

Kurnool: దేశవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల మరణాలు చోటు చేసుకుంటుండగా అందులో ఆరు ఏడు మరణాలు హత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని దారుణంగా పొడిచి చంపడం ముక్కలు ముక్కలుగా నరకడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కర్నూల్ లో ఒక యువకుడి హత్య తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల ఎర్రబురుజు కాలనీకి చెందిన మల్లెపోగు మురళీకృష్ణ అనే 22 ఏళ్ళ యువకుడి హత్యకేసు కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఇద్దరూ నిందితులు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు లోని స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన ఎరుకలి దినేష్‌, కిరణ్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మురళికృష్ణను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మురళీకృష్ణ డెకరేషన్ పనులు చేస్తూ ఉండేవాడు. అయితే ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న దినేష్‌, మురళీకృష్ణ ఇద్దరు చిన్ననాటి బాల్య మిత్రులు. ఇద్దరు కలిసి పదో తరగతి వరకు ఒకే చోట చదివారు. ఈనేపథ్యంలో దినేష్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను తన సెల్‌ఫోన్‌లో ఉంచుకున్నాడు. వాటిని చూసిన మురళీకృష్ణ తన స్నేహితుడు దినేష్ కు తెలియకుండా తన మొబైల్ లోకి షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత దినేష్‌ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

 

ఇక ప్రియురాలి ఆత్మహత్య విషయం తెలుసుకున్న దినేష్, ఎలా అయిన మురళి క్రిష్ణ ని చంపాలి అనుకున్నాడు అదే కాలనీకి చెందిన తన స్నేహితుడు డిగ్రీ చదివే కిరణ్ ‌కుమార్ ‌ను జత చేసుకుని ఈ ఏడాది జనవరి 25న బాలాజీనగర్ ‌లో మురళీకృష్ణ పనిచేస్తుండగా వారిద్దరూ వెళ్లి అతణ్ని కలిశారు. మృతుడికి సంబందించిన బట్టలు, వస్తువులు జొహరాపురం సమీపంలో పడవేశారు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు వీరి ఆటోను ఆపి తనిఖీ చేయగా కత్తి దొరికింది. అనుమానంతో వారిని విచారించగ నిందితులు ఊరికే వచ్చాము అన్నట్లుగా బుకయించారు. పోలీసులు కూడా అప్పటివరకు వీరికి ఎలాంటి నేరచరిత్ర లేకపోవటంతో వదిలేశారు. రోజులు గడిచినా మురళీకృష్ణ ఇంటికి రాకపోయేసరికి అతని తల్లిదండ్రులు గాలించారు. ఫిబ్రవరి 16న అతని తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్బన్‌ ఎస్సై సమీర్‌ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాంతో దినేష్‌, కిరణ్‌కుమార్‌లు రెవెన్యూ కార్యాలయంలో లొంగిపోయి నేరం అంగీకరించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -