Devarakonda: ఇంటర్ అమ్మాయి కూలి అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ.. కానీ?

Devarakonda: ఈ మధ్యకాలంలో యువత అనే ప్రేమ తప్పు దావలో నడుస్తూ దాని కోసం ఎంతటి దారుణానికైనా తెగించడానికి సిద్ధపడుతున్నారు. ఉదాహరణగా ఇప్పటికే ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించిన యువత దక్కలేదని ఆత్మహత్య చేసుకోవడం ప్రేమించిన యువకుడు కాదన్నాడని ఆత్మహత్యకు పాల్పడడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా ఒక యువకుడు ప్రాణ స్నేహితుడిని ప్రేమ కోసం అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ దారుణమైన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్ అనే 20 ఏళ్ల యువకుడు డిగ్రీ చదువుతూ చదువుని మధ్యలోనే ఆపేసి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఇక కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి అనే 16 ఏళ్ల బాలిక దేవరకొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఇలా వేరు వేరు గ్రామాలకు చెందిన వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.
గత ఏడాది చింతపల్లి మండలం పరిధిలోని మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న సమయంలో దేవికి రాకేశ్ తో పరిచయం ఏర్పడింది.

 

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాది పాటు ప్రేమించుకున్న వారిద్దరు తమ ప్రేమను పెద్దలకు చెప్పాలని భావించి, ఈక్రమంలోనే ఇటీవల ఇరువురూ వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. వీరి ప్రేమపై రాకేశ్ కుటుంబ సభ్యులు అంగీకరించగా యువతి తరపు బంధువులు మాత్రం నిరాకరించారు. అంతే కాకుండా యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాకేశ్ కు ఫోన్ చేసిన దేవి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నిన్ను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లమని కోరింది. దీంతో అదే రోజు సాయంత్రం రాకేశ్, దేవిలు తమ ఇంటి నుంచి పారిపోయి నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామం సమీపంలోని ఉచ్చల బుడ్డి వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని వారి వెంట పురుగుల మందు తీసుకెళ్లారు. అక్కడి వెళ్లిన తరువాత పురుగులు మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నారు. చాలా సమయం తరువాత అటుగా వెళ్లిన గ్రామస్తులు రాకేశ్, దేవిల మృతదేహాలను చూశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని ఆ నోట్ రాసి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -