YS Jagan: స్వరూపానంద కోరినా ఆ విషయంలో వెనక్కు తగ్గిన సీఎం జగన్.. ఏం జరిగిందంటే?

YS Jagan: ప్రజావ్యతిరేకత వస్తుందని భయపడ్డారో.. ఏమో కానీ.. జగన్ శారదాపీఠాధిపతి స్వరూపానంద కోరికను తీర్చడంలో వెనకడుగువేశారు. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ గా మారింది. గతేడాది చివరిలో తనకు భూమి కావాలని పీఠాధిపతి స్వరూపానంద ప్రభుత్వానికి అర్జీపెట్టుకున్నారు. పీఠం విస్తరిస్తామని.. వేద పాఠశాల పెడతామని.. కాబట్టి ప్రభుత్వం భూమని కేటాయించాలని కోరారు. స్వరూపానంద అడగడమే ఆలస్యంగా విశాఖపట్నం, భీమిలీ సమీపంలోని కొత్తవలస దగ్గర 15 ఎకరాల భూమి కేటాయించారు.

విశాఖలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజధాని ప్రకటన, పక్కనే భోగాపురం విమానాశ్రయం రావడంతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ పెరిగింది. భీమిలి మండలం కొత్త వలసలో కూడా భూమికి మంచి ధర ఉంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వం శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని రాసి ఇచ్చింది. అయితే, మార్కెట్ ధరకు ఇస్తే పర్వాలేదు. కానీ, కారు చవకగా ఇచ్చి స్వామి భక్తిని చూపించుకున్నారు సీఎం జగన్. కొత్తవలసలో సర్వే నెంబర్ 120లో 7.7 ఎకరాలు, 103లో 7.3 ఎకరాలు భూమికి శారదా పీఠానికి రాసిచ్చారు. మార్కెట్ ధర ప్రకారం అక్కడ గజం రూ. 25 వేలు ఉంది. అంటే ఎకరం రూ. 10 కోట్లు పలుకుతుంది. అంటే.. 15 ఎకరాలకు రూ. 150 కోట్లు ధర ఉంటుంది. కానీ.. ప్రభుత్వం ఎకరం కేవలం లక్ష రూపాయలు.. అంటే.. 15 ఎకరాలు రూ. 15 లక్షల రూపాయలకు అప్పనంగా ఇచ్చేసింది. దీంతో.. ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.

అయితే, ఇక్కడే పీఠాధిపతి ఒక ట్విస్ట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు చాలా భూములు ఉన్నాయని.. పీఠం విస్తరణకు వాటిని వాడుకుంటామని.. ఈ భూమిలో వ్యాపారం చేసుకుంటామని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ప్రభుత్వం తమ వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ దరఖాస్తును చూసిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు సైలంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కనుక ఆ అర్జీని తిరస్కరించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని పీఠం విస్తరణకే వాడుకోవాలని తెలిపారు. వ్యాపారం చేయడానికి వీలులేదని తేల్చి చెప్పారు. అయితే.. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా భూములు ఉన్నాయని పీఠం తెలిపింది. దీంతో.. ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలి. కానీ, ఆ పని చేయలేదు.

అయితే, జగన్ నిర్ణయంపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత క్రిష్టియన్లు వైసీపీకి వ్యతిరేకం అవుతున్నారు. వారి మన్ననలు పొందడం కోసమే శారదా పీఠానికి భూ కేటాయింపు రద్దు చేశారని చర్చ నడుస్తోంది. అందులో కూడా ఎంతో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే.. గత 2 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ సాయంతో క్రైస్తవులును వైసీపీ వైపు తిప్పుకున్నారు. కానీ, ఇప్పుడు షర్మిలకు, జగన్ కు పడటం లేదు. పైగా మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో, క్రిస్టియన్లు జగన్ కు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు వారిని ప్రసన్నం చేయడానికే జగన్ శారదా పీఠానికి వ్యాపారానికి పర్మిషన్ ఇవ్వలేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -