Unstoppable with NBK: బాలయ్య అన్ స్టాపబుల్ షోకు జగన్.. ఇలా జరిగితే అదుర్స్ కదా?

Unstoppable with NBK: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నందమూరి బాలకృష్ణ గురించి అతడి నటన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ కి ఇప్పటి యువకులు కూడా ఒక రేంజ్ లో ఫిదా అవుతారు. అలా బాలయ్య టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో నటుడుగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇక ఇటీవల విడుదలైన అఖండ సినిమాలో బాలయ్య నటనకు బి టౌన్ ప్రేక్షకుల సైతం ఒక రేంజ్ లో ఫీదా అయ్యారు. ఇక ఇదంతా పక్కన పెడితే బాలయ్య అన్ స్టాపబుల్ టు షో గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈ షోకు చంద్రబాబు వస్తాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి.

అయితే కొంతమంది నెటిజన్లు ఈ షో కి జగన్ వస్తే బాగుంటుందని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే జగన్ బాలకృష్ణ అభిమాని అన్న విషయం గురించి మనందరికీ తెలుసు. కానీ రాజకీయంగా ఇద్దరు వేరువేరు పార్టీలో ఉంటున్నారు. కాగా వీరిద్దరూ ఒకే చోట కనిపిస్తే ఎంతో హాట్ టాపిక్ గా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరి అన్ స్టాపబుల్ బాలయ్య షో కి నెటిజన్ల కోరిక మేరకు ఆ షో నిర్వాహకులు జగన్ ను రప్పించే ప్రయత్నాలు చేస్తారో లేదో చూడాలి.

ఇక బాలయ్య రాబోయే సినిమాల విషయానికొస్తే ఎన్.బి.కె 107 అనే ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అదేవిధంగా ఎన్.బి.కె 108 ప్రాజెక్టు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -