Jagan Mohan Reddy: ఛార్టర్డ్ ఫ్లైట్ లో పేదల పక్షపాతి జగన్.. ఏపీ సీఎం గురించి ట్రోల్స్ మామూలుగా లేవుగా!

Jagan Mohan Reddy: ఇటీవల ముఖ్యమంత్రి సీఎం జగన్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు క్లాస్ వార్ జరుగుతున్నది. ఒకవైపు పేదవాడు మరొకవైపు పెత్తందారీ మనస్తత్వం ఉన్నవాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా ఏ పేదవాడు ఇక ఆంధ్రప్రదేశ్లో బతికే పరిస్థితి ఉండదు. పెత్తందారులు పేదవారిని రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వచ్చింది అంటూ పాపం పేదవారి గురించి చాలా బాధపడ్డారు. బయట రాష్ట్రాల వారు ఈ మాటలు వింటే ఆయన ఒక అన్నా హజారే లేదా మరొక దీన జన బాంధవుడో అనుకుంటారు.

కానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి విమానాల్లో తిరుగుతున్నారు అంటూ నిప్పులు జరిగిన ఇదే జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కార్యక్రమానికి కూడా హెలికాప్టర్లో వెళుతూ ఉంటారు. ఈయన రాష్ట్ర పర్యటనల సందర్భంగా హెలిపాడ్ లు నిర్మించిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించనంత పేదల పక్షపాతి మన జగన్.

ఇదే పేదల పక్షపాతి ఇప్పుడు తమ కుమార్తెలను చూడటానికి భార్యతో సహా శనివారం లండన్ వెళ్లారు. 10 రోజుల పర్యటన ఇది. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనే కావచ్చు, ఖర్చులన్నీ సొంతంగానే భరిస్తూ ఉండవచ్చు కానీ పేదల పక్షపాతిని అని పదే పదే ఊదరగొట్టే జగన్ ఇలాంటి విలాసవంతమైన విమానంలో భారీగా ఖర్చు పెట్టి లండన్ టూర్ కి వెళ్ళటం అనేది ఇప్పుడు చర్చలకు దారితీస్తోంది.

ఇప్పుడు జగన్ దంపతులు వెళ్లిన విమానం.. ఎంబ్రాయెర్ లినేజ్ 1000 విమానం. దీనిలో 19 మంది మాత్రమే ప్రయాణించవచ్చు. అత్యంత విలాసమైన విమానాలలో ఇది ఒకటి. ఆయన ఈ టూర్ ముగించటం కోసం కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నారు ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కూడా తాను పేదల పక్షపాతిని అని చెప్పుకు తిరగడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాల వారు. మరి ఎందుకు జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -