YS Jagan: ఏపీ సీఎం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఫ్యామిలీ స్ట్రోక్స్.. ఏం జరిగిందంటే?

YS Jagan: నాకంటూ కుటుంబం లేదు… మీరే నా కుటుంబం అంటూ ప్రజలనుద్దేశించి జగన్ ఎమోషనల్ డైలాగ్స్ ఈ మధ్య కాలంలో బాగా చెబుతున్నారు. జగన్ చెప్పినట్టు.. ప్రజలు ఆయన కుటుంబంలో భాగమో కాదో తెలియదు కానీ.. నిజంగానే ఆయనకంటూ ఓ కుటుంబం లేకుండా పోయింది. ఆయన భార్య, కుమార్తె తప్పా.. ఫ్యామిలీ పరంగా అందరూ దూరమైపోయారు. తల్లి, చెల్లి, బాబాయ్ ఫ్యామిలీ అందరూ దూరం అయిపోయారు. అయితే.. ఇదంతా ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అనుకున్నవారిని గత ఎన్నికల తర్వాత ఆయనే దూరం చేసుకున్నాడు.

తల్లితో కలిసి పార్టీ పెట్టి.. ఆమెతో కలిసే తన మొదటి అడుగులు వేశారు. ఆమె కన్నీళ్లు కార్చితే.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు.. వైసీసీ వైపు మారారు. తర్వాత.. జగన్ జైలుకు వెళ్లే.. చెల్లి షర్మిలను షర్మిల తన పాదయాత్రతో పార్టీ చచ్చిపోకుండా కాపాడారు. వివేకా హత్య సమయంలో వైఎస్ సునీత, వివేకా భార్య సౌభాగ్యమ్మ పేరు వాడుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని విస్మరించారు. ఇక ఏపీలో మీసేవలు చాలు.. వెళ్లి తెలంగాణలో రాజకీయం చేసుకోవాలని తల్లి చెల్లిని బలవంతంగా పార్టీ నుంచి పంపించేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకాహత్యకేసు దర్యాప్తుకు సీబీఐ దర్యాప్తు వేస్తానని చెప్పిన జగన్.. ఆ హామీని మర్చిపోయారు. ఆ కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం దర్యాప్తును ఆడ్డుకునే ప్రయత్నం చేశారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ సునీతపై తప్పుడు ప్రచారం చేశారు. ఆస్తి కోసం సునీతే వివేకానందరెడ్డిని చంపించిందని అబాండాలు వేశారు. ఇలా అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన వారందరని జగన్ వదిలించుకున్నారు. దీంతో జగన్ కు బుద్ది చెప్పడానికి సొంత ఫ్యామిలీ తిరగబడింది. ఎవరైతే జగన్ గెలుపులో భాగం అవుతున్నారో.. వారే జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి సిద్దం అవుతున్నారు.

కాంగ్రెస్ తరుఫున కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారు. షర్మిల కడప నుంచి పోటీ దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ జాబితా విడుదలైతే తొలి పేరు షర్మిలదే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి కడప ఎంపీగా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ చేయాలని అనుకున్నారు. టీడీపీ తరుఫున కానీ.. ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. టీడీపీ కూడా వారితో సంప్రదింపులు జరిపినట్టు వార్తాలు వచ్చాయి. కానీ.. ఆమె వయసు రీత్య ఎంపీ నియోజవర్గం మొత్తం ప్రచారం చేయడం కష్టమని సౌభాగ్యమ్మకు బదులు తానే పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. దీంతో సునీత పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలగా రాజకీయం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే.. జగన్ వర్సెస్ షర్మిలగానే ఉంటుంది. అవినాష్ రెడ్డి వివేకా హత్యకేసులో బెయిల్ పై ఉన్నారు. కానీ.. జగన్ ఆయనకు టికెట్ నిరాకరించడానికి సాహసించలేదు. వివేకాహత్య కేసుతో చాలా మంది వైఎస్ కుటుంబం అవినాష్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు. దస్తగిరి కూడా అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాలన్ని షర్మిలకు కలిసి వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలకు జగన్ ఉమ్మడి శత్రువు కనుకు వైసీపీ ఓటమి కోసం టీడీపీ, జనసేన కూడా షర్మిలకు లోపాయికారి సహకరించే అవకాశం ఉంటుంది. అటు తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాల నుంచి కూడా షర్మిలకు సంపూర్ణ మద్దతు ఉంటుంది.

ఇక వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి జగన్ పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సౌభాగ్యమ్మతో పాటు.. ఆమె కుమార్తె సునీత కూడా విస్తృతంగా ప్రచారం చేస్తే.. గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా వైసీపీకి వ్యతిరేకంగా పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. అది కూడా సౌభాగ్యమ్మకు కలిసి వస్తుంది. జగన్ మేనత్త విమలా రెడ్డి మినహా.. వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి జగన్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే రేపటి రోజున ఆయన రాజకీయ భవిష్యత్ శూన్యం కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆయనకు కచ్చితంగా ఫ్యామిలీ స్టోక్ రావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -