YS Sharmila: కడప ఎంపీగా షర్మిల.. బాబాయ్ హత్యకు న్యాయం చేయాలని ఆమే బరిలో దిగుతుందా?

YS Sharmila: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు నూకలు లేకుండా అయిపోయాయి. మళ్లీ బతికి బటకడుతుందని ఎవరూ ఊహించలేదు. అలా అని ఇప్పుడు కాంగ్రెస్ బలపడిందని కూడా చెప్పలేం. కానీ, బలపడటానికి ప్రయత్నాలు చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విరమ్శలు చేస్తూ దూకుడు పెంచారు. అంతేకాదు.. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలను ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని టీడీపీ, జనసేనపై కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో.. రేసులో కాంగ్రెస్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. అటు.. కాంగ్రెస్ ను ఏపీలో బలపరచడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖలో ఉక్క ఫ్యాక్టరీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభ పెట్టారు. అక్కడ కాంగ్రెస్ కు 25 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏపీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ నుంచి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అందులోనూ షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ తొలి జాబిత విడుదల కానుంది. అందులో షర్మిల పేరు ఉండే అవకాశం ఉంది. అయితే.. షర్మల కడప ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అలా చేస్తే కాంగ్రెస్ బలపడటంతో పాటు తన లక్ష్యం కూడా నెరవేరుతోంది. అసలు వైఎస్ ఫ్యామిలీలో గొడవలు రావడానకి ప్రధాన కారణం కడప ఎంపీ స్థానం. వైఎస్ ఉన్నంత వరకూ ఆయన ఫ్యామిలీ వారే కడప నుంచి పోటీ చేసేవారు. తొలుత రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. కానీ, వైఎస్ మరణం తర్వాత మొదటిసారి భారతీ దగ్గర బంధువైన అవినాష్ రెడ్డికి కడప టికెట్ కేటాయించారు.

ఆ విషయంలోనే వివేకానంద రెడ్డి జగన్‌తో గొడవ పడినట్టు ప్రచారం కూడా ఉంది. వివేకాహత్య కూడా అందుకే జరిగిందని ఇంటా బయటా ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డికి జగన్ సపోర్టు చేస్తే వివేకా కుమార్తెకు షర్మిల అండగా ఉంటున్నారు. విజయమ్మ, సునీతతో పాటు.. రాజశేఖర్ రెడ్డి బంధువర్గంలో ఎక్కువ మంది మద్దతు షర్మిలకే దక్కింది. దీంతో.. కడప ఎంపీగా పోటీ చేసి అవినాష్ రెడ్డిని ఓడిస్తే.. మళ్లీ కడప వైఎస్ ఫ్యామిలీకే దక్కినట్టు అవుతుంది. పైగా.. వివేకాహత్య కేసు విషయంలో ప్రజా కోర్టులో తమకు న్యాయం జరిగిందని అటు షర్మిల, ఇటు సునీత కూడా అనుకునే అవకాశం ఉంటుంది. దీంతో.. ఆమె కడప ఎంపీ బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. ఇక.. షర్మిల కడపలో పోటీచేస్తే స్థానిక టీడీపీ, జనసేన నేతలు కూడా ఆమెకు సహకరించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఓడించాలనేది షర్మిల లక్ష్యం అయితే.. జగన్ కంచుకోటను బద్దలకొట్టాలన్నది టీడీపీ లక్ష్యం రెండూ నెరవేరాలంటే బరిలో షర్మిల ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కాంగ్రెస్ తొలిజాబితాలో ఈ ఉత్కంఠకు తెరపడుతుందా? లేదా? చూడాలి

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -